గుర్రంపై ఊరేగింపునకు సిద్ధమైన వరుడు.. సడన్‌గా పోలీసుల ఎంట్రీ.. అసలు నిజం తెలిసి వధువుకు షాక్..!
ABN , First Publish Date - 2022-04-22T14:10:05+05:30 IST
బంధువులు, సన్నిహితులతో పెళ్లి ఊరేగింపు సందడి సందడిగా ఉంది. కల్యాణ మండపం వరకు ఊరేగింపు నిర్వహిచేందుకు సర్వం సిద్ధం చేశారు. వరుడిని...
బంధువులు, సన్నిహితులతో పెళ్లి ఊరేగింపు సందడి సందడిగా ఉంది. కల్యాణ మండపం వరకు ఊరేగింపు నిర్వహిచేందుకు సర్వం సిద్ధం చేశారు. వరుడిని ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు గుర్రాన్ని కూడా తీసుకొచ్చారు. పెళ్లి దుస్తుల్లో వచ్చిన వరుడు గుర్రం ఎక్కే క్రమంలో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి పోలీసులు ఎంటరవడంతో వరుడితో పాటూ వధువు కూడా షాక్ అయింది. అక్కడే ఉన్న ఓ యువతి చెప్పింది విని.. వధూవరుల తరపు కుటుంబ సభ్యులు, బంధువులు అవాక్కయ్యారు. కాసేపట్లో పెళ్లి చేసుకోవాల్సిన వరుడు.. జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పరిధి రాజ్‌గఢ్ జిల్లా సారంగపూర్ ప్రాంతానికి చెందిన అనురాగ్ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో పని చేస్తుండేవాడు. రెండేళ్ల క్రితం అతడికి అక్కడే పని చేస్తున్న ఓ యువతి పరిచయమైంది. వారి పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ యువతి కూడా అతన్ని బాగా నమ్మింది. ఈ క్రమంలో ఆమె శారీరకంగా అతడికి దగ్గరైంది. అయితే పెళ్లి ప్రస్తావన ఎప్పడు తెచ్చినా వాయిదా వేస్తూ వచ్చేవాడు. యువతికి తెలీకుండా మరోవైపు పెళ్లి సంబంధాలు చూసుకునేవాడు. ఇటీవల అతడికి వివాహం నిశ్చయమైంది. బుధవారం వివాహ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
ప్రియుడు అడిగాడని స్నానం చేసే సమయంలో వీడియో కాల్ చేసింది... ఎలాగైనా కలవాలంటూ కొన్నాళ్ల తర్వాత అతడి నుంచి మెసేజ్.. తీరా చూస్తే..
అయితే ఈ విషయం యువతికి తెలిసింది. మంగళవారం రాత్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆమెను తీసుకుని వరుడి స్వగ్రామానికి బయలుదేరారు. వరుడు గుర్రంపై ఊరేగింపునకు సిద్ధంగా ఉండగా.. అక్కడికి పోలీసులు ఎంటరయ్యారు. వారిని చూసిన బంధువులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తర్వాత యువతి చెప్పింది విని... బంధువులతో పాటూ వధువు కూడా షాక్ అయింది. వివాహ కార్యక్రమాన్ని నిలిపేసిన పోలీసులు.. వరుడిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.