రూ.28 చిల్లర కోసం గొడవ.. ఆటో వెంట పడుతూ ప్రాణాలు కోల్పోయిన టెకీ.. ఆరేళ్ల తర్వాత రూ.43 లక్షల పరిహారం..
ABN , First Publish Date - 2022-06-22T03:23:32+05:30 IST
అది 2016 జూలై 23 మధ్యాహ్నం 1.30గంటల సమయం. ఓ యువకుడు ముంబై విమానాశ్రయం నుంచి ఆటోలో తన నివాసానికి చేరుకున్నాడు. అయితే ఆటో డ్రైవర్‌తో చిల్లర విషయంలో గొడవ..
అది 2016 జూలై 23 మధ్యాహ్నం 1.30గంటల సమయం. ఓ యువకుడు ముంబై విమానాశ్రయం నుంచి ఆటోలో తన నివాసానికి చేరుకున్నాడు. అయితే ఆటో డ్రైవర్‌తో చిల్లర విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడిపాడు. యువకుడు దాన్ని వెంటపడే క్రమంలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆరేళ్ల తర్వాత మృతుడి కుటుంబానికి రూ.43లక్షల పరిహారం అందబోతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ముంబైలోని విక్రోలి ప్రాంతంలో నివసిస్తున్న చేతన్ అచిర్నేకర్ అనే యువకుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడు. 2016 జూలై 23 మధ్యాహ్నం 1.30గంటలకు పని ముంగించుకుని, ఆటోలో ఇంటికి చేరుకున్నాడు. రూ.172లు చార్జ్ కావడంతో దిగగానే డ్రైవర్‌కు రూ.200 చెల్లించాడు. రూ.28చిల్లర ఇవ్వాలని డ్రైవర్‌ను అడిగాడు. అయితే ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు చిల్లర ఇవ్వకుండా ఆటోను వేగంగా కదిలించాడు. దీంతో వెంబడించే క్రమంలో చేతన్.. ఆటో కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం కొన్ని రోజులకు చేతన్ కుటుంబ సభ్యులు.. బీమా మొత్తాన్ని చెల్లించాలని ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని డిమాండ్ చేశారు.
36 రోజుల క్రితం పెళ్లి.. సిటీలో కొత్త కాపురం.. భార్యను ఇంట్లోనే ఉంచి సొంతూరికి వచ్చి భర్త ఆత్మహత్య.. అసలు ట్విస్ట్ ఏంటంటే..
అయితే డబ్బులు చెల్లించేందుకు కంపెనీ వారు నిరాకరించారు. ఈ విషయమై మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ముందు కంపెనీ వాదించింది. మరోవైపు ఆటో కారణంగానే చేతన్ మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. ఈ విషయాన్ని గుర్తించిన ట్రిబ్యునల్.. చేతన్ కుటుంబ సభ్యులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చేతన్ కుటుంబ సభ్యులకు బీమా కంపెనీ, ఆటోరిక్షా యజమాని కమలేష్ మిశ్రా సంయుక్తంగా రూ.43 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించారు. ప్రమాదం జరిగినప్పుడు చేతన్ నెల జీతం రూ.15,000. దీనిని దృష్టిలో ఉంచుకుని ట్రిబ్యునల్ నష్టపరిహారాన్ని వడ్డీతో సహా నిర్ణయించింది.