5 నెలల క్రితం పెళ్లి.. డాబాపై పడుకుని పొద్దునే కొడుకు, కోడల్ని లేపేందుకు వస్తే గదిలో కనిపించిన దృశ్యం చూసి..!

ABN , First Publish Date - 2022-05-19T17:49:52+05:30 IST

ప్రేమ సంబంధిత వ్యవహారాలు, వివాహేతర సంబంధాల కారణంగా ఇటీవల దారుణ ఘటనలు తరచూ చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. రోజూ ఎక్కడో చోట ఇలాంటి...

5 నెలల క్రితం పెళ్లి.. డాబాపై పడుకుని పొద్దునే కొడుకు, కోడల్ని లేపేందుకు వస్తే గదిలో కనిపించిన దృశ్యం చూసి..!

ప్రేమ సంబంధిత వ్యవహారాలు, వివాహేతర సంబంధాల కారణంగా ఇటీవల దారుణ ఘటనలు తరచూ చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. రోజూ ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమించాలంటూ యువతులను వేధించడం, ప్రేమ వివాహాలకు పెద్దలు అంగీకరించకపోవడం తదితర కారణాల వల్ల చాలా మంది హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.  వారికి ఐదు నెలల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో ఓ రోజు డాబాపై పడుకుని ఉన్న కొడుకు, కోడల్ని లేపేందుకు తండ్రి వెళ్లాడు. తీరా అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్ఫూర్ పరిధి దర్శన్‌పూర్వాలో శివ తివారీ అలియాస్ శివమ్ (27), జూలీ రాజ్‌పుత్ (25) దంపతులు తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరు ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. శివ టీ దుకాణం నడుపుతూ కటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యాభర్తలకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో వారి కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేవు. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి  శివమ్ తన భార్యతో కలిసి ఇంటి డాబాపై పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం శివమ్ తండ్రి దీప్‌కుమార్‌ తివారీ.. వారిని నిద్ర లేపేందుకు వెళ్లాడు. లోపలికి వెళ్లగానే కొడుకు, కోడలు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు.

ఈ ఫొటోలోని ఆరేళ్ల పాప ఇప్పుడు బతికిలేదు కానీ అయిదుగురి ప్రాణాలను కాపాడింది.. అసలేం జరిగిందంటే..


ఊహించని ఈ ఘటనతో శివం తండ్రితో పాటూ స్థానికులంతా షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్ బృందంతో అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని దుండగులు శివమ్ దంపతులను కత్తితో గొంతు కోసి పరారైనట్లు గుర్తించారు. మృతుల సన్నిహితులే ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. శివమ్ ప్రేమ వివాహాన్ని అతడి బంధువులు వ్యతిరేకించారని తెలిసింది. దీంతో వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. 

పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ప్రేమించింది.. ఓ రోజు ప్రియుడు పిలవడంతో ఊరి బయటకు వెళ్లింది.. తీరా చూస్తే..

Updated Date - 2022-05-19T17:49:52+05:30 IST