కూరగాయలు తెస్తానని వెళ్లిన భార్య.. రాత్రైనా రాకపోవడంతో డౌట్.. ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పింది విన్న ఆ భర్తకు..
ABN , First Publish Date - 2022-04-28T19:05:51+05:30 IST
వారికి పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు. సంసారం సాఫీగా సాగుతున్న సమయంలో అనుకోని సమస్యలు వచ్చి పడ్డాయి. ఇటీవల ఓ రోజు కూరగాయలు...
వారికి పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు. సంసారం సాఫీగా సాగుతున్న సమయంలో అనుకోని సమస్యలు వచ్చి పడ్డాయి. ఇటీవల ఓ రోజు కూరగాయలు తీసుకొస్తానని చెప్పి భార్య.. ఇంటి నుంచి బయటికి వెళ్లింది. అయితే రాత్రవున్నా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భర్త కంగారు పడ్డాడు. తెలిసిన వారిని వద్ద విచారించినా ఫలితం లేదు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అతడు చెప్పింది విని భర్త షాక్ అయ్యాడు.
బీహార్ రాష్ట్రం ఖగారియా పరిధి మాదర్ గ్రామానికి చెందిన బబ్లు కుమార్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి పదేళ్ల క్రితం వివాహమైంది. వీరి ఇంట్లో ఇంత వరకు ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. చోటి తెలుంచ అనే గ్రామానికి చెందిన సమిత్ కుమార్ అనే వ్యక్తి.. బబ్లు కుమార్ భార్యకు పరిచయమయ్యాడు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. సమిత్ కుమార్కు కూడా పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఇద్దరూ కుటుంబ బాధ్యతలు మరచిపోయి.. తరచూ కలుస్తూ ఉండేవారు. అంతటితో ఆగకుండా ఇటీవల పారిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 20న కూరగాయలు తీసుకొస్తానని బబ్లు కుమార్ భార్య ఇంటి నుంచి వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో బబ్లూ కుమార్.. కంగారు పడి తెలిసిన వారి వద్ద విచారించాడు. అయినా ఆచూకీ లభించలేదు.
షాకింగ్ రిపోర్ట్.. లాక్డౌన్లో ఎన్ని వేల మందికి HIV సోకిందో బయటపెట్టిన AIDS నియంత్రణ సంస్థ
ఈ క్రమంలో సమిత్ కుమార్ నుంచి బబ్లూకు ఫోన్ వచ్చింది. ‘‘మీ భార్య, నేను గుజరాత్ పారిపోతున్నాం. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అని చెప్పడంతో బబ్లూ షాక్ అయ్యాడు. తర్వాత మంగళవారం సమిత్ కుమార్.. మోర్కాహి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ప్రేమికులిద్దరినీ గ్రామానికి తీసుకొచ్చిన పెద్దలు.. అందరి ముందూ విచారించారు. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అయితే ఇందుకు బబ్లూకుమార్ కుమార్ కూడా ఒప్పుకోవడంతో అందరి సమక్షంలో ప్రేమికులిద్దరికీ వివాహం చేశారు. అయితే ఈ సమయంలో బబ్లూ ముగ్గురు పిల్లలు తమ తల్లిని వేడుకున్నారు. వద్దమ్మా.. అలా వెళ్లొద్దు అంటూ బోరున విలపించారు. అయినా మనసు కరగని ఆ మహిళ.. ప్రియుడితో పాటే వెళ్లిపోయింది. దీంతో అక్కడున్న వారు పిల్లలను చూసి.. అయ్యో పాపం అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.