66 కోట్ల రూపాయల Income Tax కట్టాలంటూ ఈ ఫొటోలోని వ్యక్తికి నోటీసులు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-17T01:55:32+05:30 IST

అతనో పెంయిటర్.. రోజూ పెయింటింగ్ చేస్తూ తద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆదాయం పెద్దగా లేని ఇతడికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు..

66 కోట్ల రూపాయల Income Tax కట్టాలంటూ ఈ ఫొటోలోని వ్యక్తికి నోటీసులు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

అతనో పెంయిటర్.. రోజూ పెయింటింగ్ చేస్తూ తద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆదాయం పెద్దగా లేని ఇతడికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపారు. ఏకంగా 66 కోట్ల రూపాయల Income Tax కట్టాలంటూ నోటీసులు పంపించారు. ఈ నోటీసు చూసి నవ్వాలో, ఏడవాలో తెలీని పరిస్థితి అతడిది. కలలో కూడా కోటి రూపాయల మాట వినని ఇతను.. ప్రస్తుతం 66 కోట్ల రూపాయలు కట్టాలి.. అని తెలియగానే ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం భిల్వారా పరిధి గులాబురా సబ్‌డివిజన్‌లోని హుర్దా గ్రామానికి చెందిన గోవింద్ వృత్తిరీత్యా పెయింటర్. స్థానిక బస్తీలో ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్న ఇతను.. రోజూ ఇళ్లకు రంగులు వేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజూ కష్టపడితే నెలకు రూ.8నుంచి 10వేల వరకూ ఆదాయం వస్తుంది. ఇదిలావుండగా, ఇటీవల అతడికి ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి 66 కోట్ల రూపాయల Income Tax కట్టాలంటూ నోటీసులు పంపారు. పైగా, జూలై 14న అజ్మీర్‌లో ఆదాయపు పన్ను శాఖ సమావేశానికి రావాలని, లేదంటే రూ.10,000ల జరిమానా విధిస్తామని చెప్పారు. దీంతో బిత్తరపోయిన గోవింద్.. తనకు సంబంధించిన పత్రాలు తీసుకుని అజ్మీర్ వెళ్లాడు. రోజూ వారీ కూలి పనులు చేసుకుంటున్న తనకు.. కోట్ల రూపాయలు కట్టమంటూ నోటీసులు ఏంటని.. అధికారుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు.

World Best Gift.. అంటూ లేఖ రాసి మరీ తల్లి పుట్టిన రోజు నాడే 15 ఏళ్ల కొడుకు బలవన్మరణం.. చిన్న కారణానికే..


ఈ సందర్భంగా అతను గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 2018లో గిరిధర్ అనే వ్యక్తి గోవింద్‌కు పరిచమయ్యాడు. ఆ సందర్భంగా గోవింద్‌కు.. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్(HINDUSTAN ZINC LIMITED) అనే కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆధార్, పాన్‌ కార్డులు తీసుకున్నాడు. బ్యాంకులో ఖాతా తెరవాలని చెప్పాడని, తర్వాత ఆ పత్రాలు వెనక్కు ఇవ్వలేదని చెప్పాడు. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం రాలేదు గానీ.. ఈ నోటీసు మాత్రం వచ్చిందంటూ గోవింద్ ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: ఈ మెట్లను మడతపెట్టొచ్చు.. చూశారంటే.. వావ్! ఏం డిజైనింగ్.. అని మీరే అంటారు..



Updated Date - 2022-07-17T01:55:32+05:30 IST