Viral Video: వావ్! ఈ seal పూలు అందించి.. ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయగానే.. ప్రియురాలి రియాక్షన్ చూడండి..
ABN , First Publish Date - 2022-06-28T23:57:16+05:30 IST
ప్రేమను వ్యక్తపరచడంలో కొందరు విభిన్న పద్ధతులను ఎంచుకుంటుంటారు. కొందరు లేఖల ద్వారా తెలియజేస్తే.. మరికొందరు పూల బొకేలు, మెసేజ్‌లు.. ఇలా వివిధ రకాలుగా తమ ప్రియురాలిని ఇంప్రెస్ చేస్తుంటారు. మనుషుల..
ప్రేమను వ్యక్తపరచడంలో కొందరు విభిన్న పద్ధతులను ఎంచుకుంటుంటారు. కొందరు లేఖల ద్వారా తెలియజేస్తే.. మరికొందరు పూల బొకేలు, మెసేజ్‌లు.. ఇలా వివిధ రకాలుగా తమ ప్రియురాలిని ఇంప్రెస్ చేస్తుంటారు. మనుషుల వరకూ ఇది మామూలే అయినా.. జంతువులకు కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయా.. అంటే ఉంటాయనే చెప్పాల్సి వస్తుంది. మూగజీవాలకు కూడా ప్రేమానురాగాలు ఉంటాయనే దానికి.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ మగ seal.. ఆడ sealకు పూల బొకేను అందిస్తుంది. దాన్ని తీసుకున్న ఆడ seal రియాక్షన్.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది..
ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ స్మిమ్మింగ్ పూల్‍లో రెండు sea lions ఈదుతూ ఉంటాయి. స్మిమ్మింగ్ పూల్ పైన చాలా మంది సందర్శకులు వాటిని ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. ఇంతలో మగ మగ seal.. అక్కడే ఓ తాడుకు వేలాడుతున్న పూల బొకేను తీసుకుని, ఆడ sealకు అందిస్తుంది. దాన్ని తీసుకున్న ఆడ seal.. సంతోషంతో ఉప్పొంగిపోతుంది. పూల బొకేను పట్టుకుని మెళికలు తిరుగుతూ.. తన సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. ఆడ సీల్ ఆనందాన్ని చూసి.. మగ సీల్ కూడా ఆనందంతో డ్యాన్స్ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. వీటిని చూసిన నెటిజన్లు.. హార్ట్ సింబల్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. వావ్! ఈ సీల్ తన ప్రేమను ఎంత అందంగా ఎక్స్‌ప్రెస్ చేసింది.. అంటూ కొందరు, జంతువులకు కూడా ప్రేమ అంటే ఏంటో తెలుసు.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.