పాడయిన మొబైల్‌ను రిపేరుకు ఇచ్చిన వ్యక్తి.. నాలుగు రోజుల తర్వాత ఆన్ చేసి చూడగా.. షాకింగ్ సీన్..
ABN , First Publish Date - 2022-10-25T20:00:59+05:30 IST
ప్రస్తుత టెక్నాలజీ (Technology) యుగంలో రెప్పపాటు కాలంలో మనకు కావాల్సిన సమాచారం చేతిలోకి వచ్చి వాలుతోంది. అలాగే అంతే వేగంగా మోసాలు కూడా జరుగుతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బ్యాంకు ఖాతాలు ఖాళీ అవడం మాత్రం ఖాయం. అక్షరాస్యులు, నిరక్ష్యరాస్యులు అనే తేడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో..
ప్రస్తుత టెక్నాలజీ (Technology) యుగంలో రెప్పపాటు కాలంలో మనకు కావాల్సిన సమాచారం చేతిలోకి వచ్చి వాలుతోంది. అలాగే అంతే వేగంగా మోసాలు కూడా జరుగుతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బ్యాంకు ఖాతాలు ఖాళీ అవడం మాత్రం ఖాయం. అక్షరాస్యులు, నిరక్ష్యరాస్యులు అనే తేడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో.. ఏదో ఒక రోజు మోసానికి గురవుతున్నారు. ముంబైలో తాజాగా ఇలాంటి ఓ కేసు వెలుగులోకి వచ్చింది. మొబైల్ పాడవడంతో ఓ వ్యక్తి రిపేరుకు (Mobile Repair Shop) ఇచ్చాడు. అయితే నాలుగు రోజుల తర్వాత ఫోన్ తీసుకుని చూసి.. షాక్ అయ్యాడు.. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని (Mumbai) సకినాకా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన పంకజ్ కదమ్ అనే వ్యక్తి స్మార్ట్ ఫోన్ (Smart phone) స్పీకర్‌లో సమస్య వచ్చింది. దీంతో అక్టోబర్ 7న రిపేరుకు తీసుకెళ్లాడు. మొబైల్ దుకాణ యజమాని ఫోన్ చెక్ చేసి రిపేరు చేసేందుకు ఒప్పుకొన్నాడు. అయితే సిమ్ కార్డు అలాగే ఉంచాలంటూ షరతు పెట్టాడు. దీంతో పంకజ్.. మొబైల్ అక్కడే పెట్టి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు దుకాణానికి వెళ్లగా మూసి ఉంది. దీంతో 9, 10వ తేదీల్లో మళ్లీ వెళ్లగా.. అప్పటికీ దుకాణం మూసే ఉంది.
చివరకు 11వ తేదీ వెళ్లగా దుకాణంలో మరో వ్యక్తి ఉన్నాడు. ఫోన్ ఇవ్వమని అడగ్గా.. అతడు ఏవేవో సాకులు చెప్పాడు. దీంతో పంకజ్‌కు అనుమానం వచ్చింది. చివరకు తన స్నేహితుడి సాయంతో బ్యాంక్ యాప్ సాయంతో చెక్ చేయగా.. అతడి ఖాతా నుంచి రూ.2.2లక్షలు మాయమైనట్లు తెలిసింది. మోసపోయానని తెలుసుకున్న పంకజ్.. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.