Shocking: బాలికకు భూతవైద్యం చేస్తానని ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి.. కాసేపటికి పరుగెత్తుకుంటూ బయటికి వెళ్లాడు.. ఏం జరిగిందో అని లోపలికి వెళ్లి చూస్తే..
ABN , First Publish Date - 2022-07-18T00:07:22+05:30 IST
కొందరు మోసగాళ్లు ఏదో ఒకరకంగా మహిళలను మోసం చేయాలని చూస్తుంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని ఘటనల్లో యువతలు ధైర్యంగా ఎదుర్కొని.. మోసగాళ్ల..
కొందరు మోసగాళ్లు ఏదో ఒకరకంగా మహిళలను మోసం చేయాలని చూస్తుంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని ఘటనల్లో యువతలు ధైర్యంగా ఎదుర్కొని.. మోసగాళ్ల బారి నుంచి తప్పించుకుంటుంటారు. బీహార్(Bihar)లో ఇటీవల అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బాలికకు భూత వైద్యం చేస్తానంటూ ఓ వ్యక్తి గదిలోకి వెళ్లి తలుపులు మూశాడు. కాసేపటికి పరుగెత్తుకుంటూ బయటికి వెళ్లిపోయాడు. దీంతో ఏమైందో అని తల్లిదండ్రులు కంగారుగా లోపలికి వెళ్లి చూశారు. చివరకు జరిగింది తెలుసుని అంతా షాక్ అయ్యారు.
బీహార్ రాష్ట్రం సీతామర్హి జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ కుటుంబంలో ఇటీవల సమస్యల తలెత్తాయి. దీంతో మూఢనమ్మకాలతో తరచూ పూజలు చేయించేవారు. ఇటీవల స్నౌల్లా రెహ్మాన్ ఉస్మానీ అలియాస్ బాబా అనే వ్యక్తికి ఈ విషయం తెలియజేశారు. ఇంట్లో బాలికతో భూత వైద్యం చేయించాలని చెప్పడంతో వారు కూడా అంగీకరించారు. తర్వాత తమ 16ఏళ్ల కూతురుని ఇంట్లోకి పంపించారు.
తన భార్యకు health బాగోలేదంటూ బాలికను ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తీసుకెళ్లిన Manager.. బలవంతంగా యాసిడ్ పోసి మరీ..
లోపలికి వెళ్లిన బాబా.. పూజల పేరుతో బాలికపై అత్యాచారయత్నం చేశాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తలుపులు తీసి, పరుగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. కంగారుగా లోపలికి వెళ్లిన తల్లిదండ్రులు.. జరిగిని విషయం తెలుసుకుని, గ్రామ పెద్దల వద్దకు వెళ్లారు. అయితే వారు కూడా సమస్యను పరిష్కరించకపోవడంతో ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. నిందితుడితో పాటూ మరికొంత మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.