కొడుకు అలా చేయకుండా ఉండేందుకు.. నెలకు రూ.10వేలు ఇచ్చేలా కోడలితో అత్త ఒప్పందం.. అయినా ఫలితం లేకపోవడంతో..
ABN , First Publish Date - 2022-09-12T01:23:52+05:30 IST
కొడుకు తప్పు చేస్తే మందలించాల్సిన తల్లిదండ్రులు.. అందుకు విరుద్ధంగా కొడుక్కే మద్దతు పలుకుతుంటారు. కొందరైతే కొడుకుతో కలిసి కోడలిని చంపడానికి కూడా వెనుకాడరు. అయితే..
కొడుకు తప్పు చేస్తే మందలించాల్సిన తల్లిదండ్రులు.. అందుకు విరుద్ధంగా కొడుక్కే మద్దతు పలుకుతుంటారు. కొందరైతే కొడుకుతో కలిసి కోడలిని చంపడానికి కూడా వెనుకాడరు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కేసు గురించి ఎక్కడా విని ఉండరు. అలాగే ఇలాంటి అత్తమామలను కూడా ఎక్కడా చూసి ఉండరు. మధ్యప్రదేశ్‌లో విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. కొడుకు నుంచి కోడలు రక్షించాల్సింది పోయి.. అందుకు విరుద్ధంగా నెలకు రూ.10వేలు ఇస్తే కాపాడతామంటూ ఒప్పందం చేసుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు కోడలు తెగించి నిర్ణయం తీసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్‌కు చెందిన ఓ మహిళ.. బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తోంది. ఈమెకు ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో 2020లో వివాహమైంది. వీరికి ఎలాంటి ఆర్థిక సమస్యలూ లేకపోవడంతో సంతోషంగా ఉండేవారు. అయితే నెలలు గడిచే కొద్దీ భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. అసహజ పద్ధతిలో శృంగారం చేయాలంటూ భార్యపై ఒత్తిడి చేసేవాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో తరచూ ఆమెపై దాడికి పాల్పడేవాడు. కొన్నిరోజులు పోతే భర్తలో మార్పు వస్తుందని భావించింది. అయితే భర్త మాత్రం రోజురోజుకూ మరింత దారుణంగా ప్రవర్తించేవాడు.
వంట చేస్తున్న బాలిక వద్దకు.. పట్టపగలు పెట్రోల్ తీసుకుని వెళ్లిన యువకులు.. కాసేపటి తర్వాత స్థానికులు వెళ్లి చూస్తే..
చివరకు తుపాకీతో బెదిరించి మరీ అసహజ రీతిలో శృంగారం చేయడంతో.. విషయాన్ని అత్తకు తెలియజేసింది. కొడుకును వారించాల్సిన తల్లిదండ్రులు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. కొడుకు నుంచి కోడలిని రక్షించేందుకు నెలకు రూ.10వేలు ఇవ్వాలంటూ ఒప్పందం చేసుకున్నారు. అయినా భర్త మాత్రం రోజూ చిత్రహింసలకు గురి చేస్తుండేవాడు. కొడుకు పుట్టినా కూడా అలాగే చేయడంతో పాటూ అదనపు కట్నం తేవాలని బెదిరించేవాడు. దీంతో ఆమె విసిగిపోయి శుక్రవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.