మాకు నిశ్చితార్థం జరిగింది.. తను నాకు కాబోయే భార్య.. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండని.. కాళ్లు పట్టుకుని వేడుకున్నా..
ABN , First Publish Date - 2022-09-22T21:30:50+05:30 IST
కొందరు శాడిస్టులు జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు వారు ప్రవర్తించే తీరు అంతా అసహ్యించుకునేలా ఉంటుంది. ఇలాంటి నిందితులకు ఎన్ని శిక్షలు అమలు చేస్తున్నా..
కొందరు శాడిస్టులు జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు వారు ప్రవర్తించే తీరు అంతా అసహ్యించుకునేలా ఉంటుంది. ఇలాంటి నిందితులకు ఎన్ని శిక్షలు అమలు చేస్తున్నా.. నేరాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఇటీవల అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కొందరు యువకులు.. ఓ యువతిని తనకు కాబోయే భర్త ముందే అసభ్యకరంగా ప్రవర్తించారు. మాకు నిశ్చితార్థం జరిగింది. తను నాకు కాబోయే భార్య.. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండని.. కాళ్లు పట్టుకుని బతిమాలుకున్నా జాలి చూపించలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ (Viral videos) అవుతున్నాయి...
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మౌయిమా అనే ప్రాంత పరిధికి చెందిన యువతికి, సొరాన్కు చెందిన యువకుడితో నిశ్చితార్థం (Engagement) జరిగింది. త్వరలో వీరి వివాహం (marriage) జరిపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదిలావుండగా, బుధవారం కాబోయే భార్యను చూసేందుకు యువకులు మౌయిమాకు వచ్చాడు. ఇద్దరూ నిర్మానుష్య ప్రదేశంలో మాట్లాడుకుంటుండగా.. కొందరు యువకులు అక్కడికి వచ్చారు. యువతి చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించడంతో (Indecent behavior) పాటూ ఆమె ఒంటిపై దుస్తులను కూడా లాగేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో యువతికి కాబోయే భర్త.. అతడి కాళ్లు పట్టుకుని వేడుకుంటాడు.
వార్తాపత్రికలో పెళ్లి ప్రకటన చూసి యువతికి ఫోన్.. చివరకు తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ ఆమె చెప్పిన మాటలు విని..
‘‘మాకు నిశ్చితార్థం జరిగింది.. తను నాకు కాబోయే భార్య.. మమ్మల్ని వదిలేస్తే వెళ్లిపోతాం’’.. అంటూ వేడుకుంటాడు. అయినా అతను మాత్రం ఏమాత్రం జాలి, దయ లేకుండా.. యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. మమ్మల్ని వదలండని యువతి వేడుకుంటున్నా కూడా చాలా సేపు ఆమెను వేధిస్తాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు స్పదించారు. విషయం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో నిందితులను పట్టుకుని.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.