భార్యను కొట్టి అర్ధనగ్నంగా కూర్చోబెట్టి మరీ ఓ భర్త దారుణం.. ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చడంతో..
ABN , First Publish Date - 2022-09-13T21:13:09+05:30 IST
కొందరు విపరీతమైన నేర స్వభావం కలిగి ఉంటారు. ఇలాంటి వారు మంచి చెడ్డా.. ఆడ మగా అనే తేడా లేకుండా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరైతే ఉన్నత పదవుల్లో ఉన్నా.. వారి..
కొందరు విపరీతమైన నేర స్వభావం కలిగి ఉంటారు. ఇలాంటి వారు మంచి చెడ్డా.. ఆడ మగా అనే తేడా లేకుండా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరైతే ఉన్నత పదవుల్లో ఉన్నా.. వారి ప్రవర్తన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. రాజస్థాన్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అతనో ఉపాధ్యాయుడు అయినా.. ఇంట్లో మాత్రం శాడిస్టులా ప్రవర్తిస్తుంటాడు. ఓ రోజు భార్యను దారుణంగా కొట్టడంతో (Assault on wife) పాటూ అర్థనగ్నంగా ఎండలో కూర్చోబెట్టాడు. ఈ వీడియో బయటికి రావడంతో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ (Rajasthan) జోధ్‌పూర్ జిల్లా ఫలోడి పట్టణానికి చెందిన కైలాష్ సుతార్ అనే వ్యక్తికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. ఇతను స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పేరుకే టీచర్ గానీ.. ఇతని ప్రవర్తన మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇంటికి రాగానే తనలోని శాడిస్టు బయటికి వచ్చేవాడు. రోజూ ఏదో ఒక సాకు చూపుతూ చిత్రహింసలకు గురి చేస్తుండేవాడు. ఇటీవల ఓ రోజు తీవ్ర ఆగ్రహానికి గురైన అతను భార్యను దారుణంగా కొట్టాడు. అక్కడే ఉన్న వారి పిల్లలు కొట్టవద్దంటూ వేడుకున్నారు. అయినా కైలాష్ మాత్రం వినిపించుకోకుండా భార్యను జుట్టు పట్టుకుని కొట్టడంతో పాటూ దుస్తులను కూడా చించేశాడు. మధ్యలో అడ్డు వచ్చిన కూతురును కూడా చితకబాదాడు.
కన్న కూతురని కూడా చూడకుండా నీచమైన పని.. గుడికి వెళ్లిన భార్య తిరిగొచ్చేసరికి..
తర్వాత అర్ధనగ్నంగా ఉన్న భార్యను చాలా సేపు ఎండలో కూర్చోబెట్టాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ అలాగే ఉండిపోయింది. అతను మాత్రం తాపీగా కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోమవారం పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలు, ఆమె పిల్లలను విచారిస్తున్నారు. మరోవైపు కైలాష్ మాట్లాడుతూ, తన భార్య మానసిక స్థితి సరిగ్గా లేదని.. చికిత్స చేయించి అసలిపోయానని చెప్పాడు. చిరాకు వచ్చి ఆమెపై దాడికి పాల్పడ్డానంటూ సమర్థించుకున్నాడు. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. కైలాష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.