పని నుంచి అలసిపోయి ఇంటికొచ్చిన భర్త.. బెడ్‌రూంలో ఎవరో ఉన్నట్లు అనుమానం వచ్చి.. తలుపు తీసి చూడగా..

ABN , First Publish Date - 2022-04-23T14:00:38+05:30 IST

ఉన్న దాంట్లో సంతోషంగా ఉండకుండా.. కొందరు అనవసరమైన ఆశలు, ఆనందాల కోసం చివరకు తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. కొందరు భర్తలు.. భార్యే...

పని నుంచి అలసిపోయి ఇంటికొచ్చిన భర్త.. బెడ్‌రూంలో ఎవరో ఉన్నట్లు అనుమానం వచ్చి.. తలుపు తీసి చూడగా..
ప్రతీకాత్మక చిత్రం

ఉన్న దాంట్లో సంతోషంగా ఉండకుండా.. కొందరు అనవసరమైన ఆశలు, ఆనందాల కోసం చివరకు తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. కొందరు భర్తలు.. భార్యే తన సర్వస్వం అని చెప్పకొంటూ.. పక్కింటి మహిళలను వక్ర దృష్టితో చూస్తుంటారు. అలాగే కొందరు భార్యలు.. భర్తే తన దైవం అని నటిస్తూ.. పరాయి మగవారిపై ప్రేమ పెంచుకుంటూ ఉంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కోకొల్లలు జరుగుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బీహార్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. భర్త పనికి వెళ్లి సాయంత్రానికి అలసిపోయి ఇంటికి వచ్చాడు. అయితే  బెడ్‌రూంలో ఏవో శబ్ధాలు వస్తుండడంతో తలుపు తీశాడు. లోపల సీన్ చూసి షాక్ అయ్యాడు.. వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం పుర్నియా జిల్లా చకర్పద గ్రామానికి చెందిన పోషిత్ కుమార్‌, సావిత్రిదేవి దంపతులు. వీరికి పదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోషిత్ కుమార్ రోజూ పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. సావిత్రిదేవి ఇంటి వద్ద ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ ఉండేది. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో అనుకోని సమస్యలు వచ్చి పడ్డాయి. వారి పక్కింట్లో ఉన్న అరవింద్ అనే వ్యక్తి.. అప్పుడప్పుడూ పోషిత్ కుమార్ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సావిత్రిదేవి, అరవింద్‌కు పరిచయం ఏర్పడింది. రోజూ చనువుగా మాట్లాడుకునేవారు. మొదట్లో పోషిత్ కుమార్ ఉన్నప్పుడు మాత్రమే వారింటికి వచ్చే అరవింద్.. తర్వాత అతడు లేని సమయంలో వచ్చి వెళ్తుండేవాడు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇలా భర్తకు తెలీకుండా అరవింద్‌తో సావిత్రిదేవి రోజూ రాసలీలలు సాగించేది.

రాత్రి 10.30 గంటల సమయం.. రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ చివర ఓ ప్రేమజంట.. కానిస్టేబుల్ చూసి నిలదీస్తే..


ఇటీవల ఓ రోజు పోషిత్ కుమార్ పని నుంచి సాయంత్రానికి అలసిపోయి ఇంటికి వచ్చాడు. బెడ్‌రూంలో ఎవరో ఉన్నట్లు అలికిడి వినిపించింది. దీంతో అనుమానం వచ్చి వెళ్లి తలుపు తీసి చూశాడు. లోపల తన భార్య.. పరాయి మగవాడి పక్కన ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పటి నుంచి ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఓ రోజు పోషిత్ కుమార్ మెడకు తాడు బిగించి హత్య చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సావిత్రదేవి, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. భార్య చేసిన తప్పు కారణంగా పిల్లలు అనాథలవడంపై స్థానికులు.. అయ్యో పాపం..! అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

కూతుర్ని బస్సు ఎక్కించి వచ్చిన తండ్రి.. ఇంట్లో నగ్నంగా వంట చేస్తున్న గుర్తు తెలియని మహిళను చూసి షాక్.. చివరకు..

Updated Date - 2022-04-23T14:00:38+05:30 IST