road accident: అయ్యో..! సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకొచ్చినా దక్కని ఫలితం.. చివరకు అంబులెన్స్ డోర్స్ కారణంగా..

ABN , First Publish Date - 2022-09-01T01:42:52+05:30 IST

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సరైన సమయానికి ఆస్పత్రికి చేర్చడం ద్వారా అంబులెన్స్ సిబ్బంది.. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటారు. అందుకే వీరికి అంతా గౌరవం..

road accident: అయ్యో..! సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకొచ్చినా దక్కని ఫలితం.. చివరకు అంబులెన్స్ డోర్స్ కారణంగా..

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సరైన సమయానికి ఆస్పత్రికి చేర్చడం ద్వారా అంబులెన్స్ సిబ్బంది.. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటారు. అందుకే వీరికి అంతా గౌరవం ఇస్తుంటారు. అంబులైన్స్ సైరెన్ వినపడగానే పక్కకు తప్పుకొని మరీ దారి ఇవ్వడం చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు అవే అంబులెన్స్‌ల కారణంగా మనుషుల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరైన సమయానికి సంఘటన స్థలాలకు చేరుకోలేకపోవడం, ఒకవేళ చేరుకున్నా.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే తాజాగా, కేరళలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకొచ్చిన అంబులెన్స్ కారణంగానే చివరకు అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..


కేరళలోని (Kerala)  కోజీకోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన కోయమోన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో (road accident) తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది.. గాయపడ్డ అతన్ని సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తీరా క్షతగాత్రుని కిందకు దించే క్రమంలో అంబులెన్స్ తలుపులు తెరుచుకోలేదు. దాదాపు గంట సేపు శ్రమించినా ఫలితం లేకుండాపోయింది. చివరకు చాలా మంది కష్టపడి డోర్లు తెరచి, బాధితుడిని ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో అంతా అయ్యో పాపం!.. ఇలా జరిగిందేంటీ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రాత్రి 9గంటలు అవుతున్నా ఇంటికి రాని కూతురు.. ఏమైందా అని విచారిస్తుండగా.. సడన్‌గా వచ్చిన ఫోన్ కాల్‌తో..



Updated Date - 2022-09-01T01:42:52+05:30 IST