Sexual dissatisfaction: ఆ విషయంలో అసంతృప్తి వల్లే.. విడాకులు కోరుతున్న 72 శాతం స్త్రీల అసలు కారణమిదే..!
ABN , First Publish Date - 2022-12-14T15:45:00+05:30 IST
జీవితాంతం సుఖసంతోషాలతో కలిసుండాలనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తారు. అయితే కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల దాంపత్య జీవితానికి మధ్యలోనే పుల్‌స్టాప్ పడుతుంటుంది. కొందరు..
జీవితాంతం సుఖసంతోషాలతో కలిసుండాలనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తారు. అయితే కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల దాంపత్య జీవితానికి (married life) మధ్యలోనే పుల్‌స్టాప్ పడుతుంటుంది. కొందరు మహిళలు పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సర్దుకుపోతుండగా, చాలా మంది స్త్రీలు కొన్ని విషయాల్లో అసంతృప్తి చెంది.. భర్తతో విడాకులు (Divorce) తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. దేశంలో విడాకులు తీసుకుంటున్న వారిలో సుమారు 72 శాతం మంది స్త్రీలు.. ఒకే కారణం చెబుతున్నారని పలు అధ్యయనాలు (studies) వెళ్లడిస్తున్నాయి. ఇందుకు గల కారణాలను విశ్లేసిస్తే..
దారుణం.. 5 ఏళ్ల బాలుడి కాళ్లను పట్టుకుని.. గాల్లో గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు..!
ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో యువతీయువకులు తీవ్రమానసిక ఒత్తిడికి (mental stress) గురవుతున్నారు. అలాగే దంపతుల్లో ఒకరికి తెలీకుండా ఒంకొకరు చేసే తప్పులు.. చివరకు విడాకుల వరకు దారి తీస్తుంటాయి. ప్రధానంగా వివాహేతర సంబంధాల (Extramarital affairs) విషయంలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. అదేవిధంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇవ్వకపోవడం, లైంగికపరమైన సమస్యలను (Sexual problems) దాచిపెట్టడం కూడా దంపతుల మధ్య సమస్యలు తలెత్తడానికి కారణమవుతోంది. దేశంలో విడాకులు తీసుకుంటున్న వారిలో 72 శాతం మంది మహిళలు.. తమ వైవాహిత జీవితంలో భర్తతో కలయిక విషయంలో అసంతృప్తిగా ఉన్నారని ఓ సర్వేలే వెల్లడైంది. అదేవిధంగా 12శాతం మంది తమ భర్తతో శారీరక సంబంధమే లేదని చెప్పారట. ఇక 8శాతం మంది మహిళలు ఇష్టం లేకున్నా.. వివాహేతర సంబంధాలకు అలవాటు పడుతున్నారని తెలిసింది.
మసాజర్ కోసం వెతుకుతుండగా.. ఆన్‌లైన్‌లో కనిపించిన భార్య ఫొటోలు.. అందులో ఇచ్చిన నంబర్‌కు కాల్ చేయగా...
మరోవైపు లైంగికపరమైన సమస్యల విషయంలో 23.6 శాతం మంది పురుషులు, 17.6 శాతం మంది మహిళలు తమ భాగస్వాములను మోసం చేస్తున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కొందరు పురుషులు తమ నపుంసకత్వాన్ని దాచి పెట్టి వివాహాలు చేసుకోవడం, తీరా అసలు విషయం తెలిశాక.. సమస్యలు తలెత్తడం జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాలు కూడా చివరకు విడాకులకు దారి తీస్తున్నాయి. అలాగే చాలా వరకు గృహహింస కేసులు కూడా దంపతుల మధ్య విడాకులకు కారణమవుతున్నాయి. ఆస్టిన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ యొక్క సైకాలజీ డిపార్ట్‌మెంట్ అధ్యయనం ప్రకారం.. 18 నుండి 26 సంవత్సరాల వయస్సు గల మహిళల కంటే 27 నుండి 45 ఏళ్ల వయసున్న స్త్రీలు లైంగిక కార్యకలాపాలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారని తేలింది.
రెండో సారి శృంగారానికి సిద్ధపడ్డ భర్త.. అయితే భార్య సమాధానంతో చివరకు.. తమ్ముడి సాయం తీసుకుని మరీ..
శృంగారానికి సంబంధించిన విషయాలపై దంపతుల మధ్య సరైన అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమయాల్లో దంపతుల్లో ఎవరో ఒకరు పరాయి వ్యక్తులతో శృంగారం చేసేందుకు మొగ్గుచూపుతుంటారు. ఇది క్రమంగా సంసారంలో చిచ్చుకు కారణమవుతుంది. కొందమంది పరిశోధకులు.. 20నుంచి 65ఏళ్ల వయసున్న పురుషులు, స్త్రీలను ప్రశ్నించారు. దేశంలో 30శాతం వివాహాలు లైంగిక అసంతృప్తి, నపుంసకత్వం తదితర కారణాల వల్ల దంపతులు విడిపోతున్నారని వెళ్లడైంది. లైంగికపరమైన సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులను సంప్రదించి పరిష్కరించుకోవడం, అలాగే మహిళ ఇష్టాయిష్టాలను గౌరవించి నడుకోవడం చేస్తే.. విడాకుల సమస్యలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.
Gold Stock End’s: బంగారానికి వార్నింగ్ బెల్స్.. 20 ఏళ్ల తర్వాత బంగారం కనిపించదు..!?