CHILD LOVE: ఈ చిన్నారి ప్రేమకు కేంద్ర మంత్రులే ఫిదా అయ్యారు.. ఇంతకీ ఆ పాప చేసిన పని ఏంటంటే..
ABN , First Publish Date - 2022-07-17T03:11:58+05:30 IST
ఈ భూమ్మీద అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో.. చిన్నారుల ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైనది.. కల్మషం లేని వారి ప్రేమకు ఎవరైనా ఇట్టే పడిపోతారు.. అందుకే పిల్లలు దేవుడితో సమానం..
ఈ భూమ్మీద అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో.. చిన్నారుల ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైనది.. కల్మషం లేని వారి ప్రేమకు ఎవరైనా ఇట్టే పడిపోతారు.. అందుకే పిల్లలు దేవుడితో సమానం అంటారు.. వారు అల్లరి మాత్రమే కాదు.. ఎంతోమందికి ఆదర్శం కూడా.. పెద్దలు సైతం పిల్లల్ని చూసి నేర్చుకోండి అంటూ యువతకు మొట్టికాయలు వేసిన సందర్భాలు లేకపోలేదు.. ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తుంది.. ఎందుకంటే సరిహద్దుల్లో సైనికులు రాత్రీ పగలూ తేడా లేకుండా.. ప్రాణాల్ని లెక్కచేయకుండా దేశ రక్షణ కోసం పోరాడుతారు.. అలాంటి సైనికులు జనం మధ్యకు వస్తే.. ఈ రోజుల్లో ప్రేమగా పలకరించడం పక్కన పెడితే, కనీసం వారిని పట్టించుకోవట్లేదు. కానీ సరిగ్గా ఐదేళ్లు కూడా లేని ఓ చిన్నారి చేసిన పనికి యావత్ దేశమే ఫిదా అయిపోయింది..
ఓ మెట్రో స్టేషన్(metro station)లో కొందరు సైనికులు(Soldiers) నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు.. వారిని చూసిన ఆ చిన్నారి... బుడి బుడి నడకలతో వారి దగ్గరికి వెళ్లింది. కొన్ని క్షణాలు వారినే చూసింది.. పాప రావడం చూసిన ఒక జవాన్... చిరునవ్వు నవ్వాడు.. వెంటనే ఆ చిన్నారి జవాన్ కాళ్లకు దండం పెట్టింది. ఆ పాప చేసిన పనికి షాక్ అయిన జవాన్.. పాపను దగ్గరకు తీసుకున్నాడు. ప్రేమగా ముద్దు పెట్టాడు. ఇదంతా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. వీడియో పోస్ట్ అయిన కొద్దిసేపటికీ వైరల్ అయింది.. దీనిపై కేంద్రమంత్రి(Union Minister) స్మృతి ఇరానీ స్పందించారు. ఆ చిన్నారిని ఆశీర్వదిస్తూ.. పాపకు ఉత్తమ విలువలు నేర్పిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే స్మృతి ఇరానీతో పాటూ మరికొందరు మంత్రులు కూడా స్పందించారు. నెటిజన్లు సైతం ఈ పాప ప్రేమకు ఫిదా అయిపోయారు.