Viral Video: పిల్లలను రోడ్డు దాటించడంలో.. ఈ గొరిల్లా ఎంత జాగ్రత్త తీసుకుంటుందో.. చూస్తే ఆశ్యర్యం కలుగుతుంది..
ABN , First Publish Date - 2022-06-25T23:26:54+05:30 IST
కొన్ని కొన్ని విషయాల్లో మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తుంటుంది. సొంత కుటుంబ సభ్యుల గురించే పట్టించుకోని నేటి సమాజంలో జంతువులను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. జంతువుల్లో గొరిల్లాల గురించి...
కొన్ని కొన్ని విషయాల్లో మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తుంటుంది. సొంత కుటుంబ సభ్యుల గురించే పట్టించుకోని నేటి సమాజంలో జంతువులను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. జంతువుల్లో గొరిల్లాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనిషిని అనుకరించడంలో వాటికి మించిన జంతువు మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ గొరిల్లా తన పిల్లలను రోడ్డు దాటించడంలో తీసుకున్న జాగ్రత్త చూసి నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు.
ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ అడవి దారిలోని మట్టి రోడ్డుపై వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అదే సమయంలో ఓ గొరిల్లా తన పిల్లలను తీసుకుని రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంది. వాహనాల రాకపోకలను గమనించిన పెద్ద గొరిల్లా.. రోడ్డు మధ్యలోకి వెళ్లి ఆగుతుంది. దాని పిల్లలు ఒక్కోక్కటిగా వరుసగా రోడ్డు దాటుతుంటాయి. వాహనదారులు దూరంగా ఆగి, వాటిని గమనిస్తుంటారు. తన పిల్లలు మొత్తం వెళ్లేదాకా, వాహనాలు రాకుండా ఉండేందుకు పెద్ద గొరిల్లా రోడ్డు మధ్యలోనే ఉంటుంది. ఈ ఘటనను మొత్తం వాహనదారులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.