ఈమెకు కుక్కంటే ఎంత అభిమానం.. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై మహిళ తీరు చూసి అవాక్కవుతున్న జనం..

ABN , First Publish Date - 2022-04-26T15:46:09+05:30 IST

కొందరు తమ పిల్లలను ఎలా చూసుకుంటారో.. పెంపుడు జంతువుల పట్ల కూడా అంతే ప్రేమ చూపిస్తుంటారు. స్నానం చేయించడం దగ్గరి నుంచి ప్రతి విషయంలోనూ..

ఈమెకు కుక్కంటే ఎంత అభిమానం.. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై మహిళ తీరు చూసి అవాక్కవుతున్న జనం..

కొందరు తమ పిల్లలను ఎలా చూసుకుంటారో.. పెంపుడు జంతువుల పట్ల కూడా అంతే ప్రేమ చూపిస్తుంటారు. స్నానం చేయించడం దగ్గరి నుంచి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరైతే పెంపుడు జంతువులకు దుస్తులు కూడా వేయడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ప్రతి ఇంట్లో కుక్కను పెంచుకోవడం సాధారణమైంది. వివిధ జాతులకు చెందిన కుక్కలను లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తుంటారు. వాటిని ఎంతో గారాబంగా చూసుకుంటుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ.. వీధి కుక్క పట్ల అభిమానం చూపించడంపై నెటిజన్లు శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు..


పశ్చిమ బెంగాల్‌లోని దమ్ దమ్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.  రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఓ కుక్కకు మహిళ పెరుగన్నం తినిపిండం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ మహిళ గిన్నె నిండా పెరుగన్నం తీసుకుని స్టేషన్‌కు వస్తుంది. పిల్లల కోసం తీసుకొస్తుందేమో అని అంతా అనుకుంటారు. కానీ ఆమె ఓ కుక్క వద్ద కూర్చోగానే అంతా ఆశ్చర్యంగా చూస్తారు. తర్వాత ఆమె కుక్కకు పెరుగన్నం కొసరి కొసరి తినిపించడం చూసి అంతా షాక్ అవుతారు.

వాళ్లకు అసలు బుద్ధుందా..? అంటూ ఈ 8 ఏళ్ల పిల్లాడి తల్లిదండ్రులపై నెటిజన్ల ఫైర్.. ఈ వీడియోను చూస్తే..


కుక్క నోరును తెరచి మరీ తినిపించడం చూస్తే.. జంతువుల పట్ల ఆమెకు ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. ఆ కుక్కకు అన్నం తినిపించేందుకు ఆమె రోజూ మూడు సార్లు స్టేషన్‌కు వస్తుందని స్థానికులు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

నీతో అస్సలు రానంటూ భర్తకు తేల్చిచెప్పిన భార్య.. కాసేపటికే పరుగెత్తుకు వచ్చి పిల్లలు చెప్పింది విని..



Updated Date - 2022-04-26T15:46:09+05:30 IST