Viral Video: 83 ఏళ్ల వయసులో కూడా ఈ బామ్మ.. ఎంత సులభంగా బరువు ఎత్తుతుందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-05-21T22:00:04+05:30 IST

కొందరు వయసును కేవలం ఒక సంఖ్యగా మాత్రమే చూస్తారు. ఫిట్‌నెస్ విషయంలో మాత్రం యువకులతో పోటీపడుతుంటారు. కొందరు వృద్ధులైతే యువకులు కూడా చేయలేని...

Viral Video: 83 ఏళ్ల వయసులో కూడా ఈ బామ్మ.. ఎంత సులభంగా బరువు ఎత్తుతుందో మీరే చూడండి..

కొందరు వయసును కేవలం ఒక సంఖ్యగా మాత్రమే చూస్తారు. ఫిట్‌నెస్ విషయంలో మాత్రం యువకులతో పోటీపడుతుంటారు. కొందరు వృద్ధులైతే యువకులు కూడా చేయలేని పనులను చాలా అవలీలగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలోని ఓ వృద్ధురాలు కూడా ఈ కోవకే చెందుతుంది. 83ఏళ్ల ఓ వృద్ధురాలు బరువును అవలీలగా ఎత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..


ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న వీడియోలో కిరణ్ బాయి అనే 83 ఏళ్ల వృద్ధురాలు మేడపై deadlift చేస్తూ ఉంటుంది. ఆమె మనవడి ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని అవలీలగా పూర్తి చేస్తుంది. 25 కిలోల బరువును ఎంతో సులభంగా పైకి ఎత్తడంతో పాటూ కాసేపు అలాగే ఎత్తుకుని ఉండడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తర్వాత దాన్ని మనవడికి అందిస్తుంది.

అంతా చూస్తుండగా నడి రోడ్డుపైకి వచ్చిన భారీ అనకొండ.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


ఆమె ఫిట్‌నెస్ విషయంలో ఎప్పటి నుంచో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేదని, అయితే కాలికి గాయమవడంతో ఏడాదిగా కసరత్తులకు దూరంగా ఉందని తెలిసింది. ప్రస్తుతం మనవడు విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌‌ను ఈజీగా పూర్తి చేయడంతో అతడితో పాటు వీడియో చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. పలువురు నెటిజన్లు వృద్ధురాలిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

జలపాతం వద్ద స్టంట్ చేయాలని చూసిన యువకుడు.. మరుక్షణమే అతడి పరిస్థితి..





Updated Date - 2022-05-21T22:00:04+05:30 IST