Viral Video: ఫొటోను చూసే అవాక్కవుతున్నారా..? ఈ King Cobra వీడియోను చూస్తే..
ABN , First Publish Date - 2022-04-28T13:32:39+05:30 IST
మామూలు పాములను చూస్తేనే ఆమడ దూరం పరుగెడతాం. అలాంటిది అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను చూస్తే.. అదీ ఒక్కసారిగా దగ్గరగా వస్తే..! ఎలా ఉంటుందో..
మామూలు పాములను చూస్తేనే ఆమడ దూరం పరుగెడతాం. అలాంటిది అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను చూస్తే.. అదీ ఒక్కసారిగా దగ్గరగా వస్తే..! ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పడగవిప్పి, కాటేయడానికి సిద్ధంగా ఉన్న కింగ్ కోబ్రా వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కింగ్ కోబ్రాను అంత దగ్గరగా ఫొటో తీసిన వ్యక్తికి ఎంత ధైర్యమో అని అనిపిస్తుంది కదా. ఇక్కడే ఓ ట్విస్టు ఉంది. ఈ వీడియో చూస్తే అది మీకే అర్థమవుతుంది...
పాములంటే ఎంత అసహ్యించుకుంటామో.. చాక్లెట్లు అంటే అంత ఇష్టపడతాం. ఈ రెండింటికీ సంబంధం ఏంటీ.. అని అనుకుంటున్నారా. అత్యధికులు ఇష్టపడే చాక్లెట్ క్రీమ్‌తో.. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా ఓ వ్యక్తికి వచ్చింది. ప్రముఖ స్విస్-ఫ్రెంచ్ చెఫ్ అయిన అమౌరీ గుయిచోన్.. చాక్లెట్‌తో కళాఖండాలను తయారు చేయడంలో సిద్ధహస్తుడు. చాక్లెట్‌తో కింగ్ కోబ్రాను తయారు చేయాలనే వినూత్న ఆలోచనను ఆచరణలో పెట్టాడు. తయారు చేసిన అనంతరం ‘‘చాక్లెట్ కింగ్ కోబ్రా! దీని స్కేల్స్ మాత్రమే నాకు 8 గంటలు పట్టింది." అనే క్యాప్షన్ ఇస్తూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూస్తుంటే.. చాక్లెట్ తినాలంటేనే భయమేస్తోంది.. అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కింగ్ కోబ్రాను తలపించేలా చాక్లెట్‌తో తయారు చేయడం అద్భుతం అంటూ మరో వ్యక్తి పేర్కొన్నాడు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.