Viral video: రైలు నుంచి పిల్లలతో పాటూ కిందకు దూకేసిన మహిళ.. సమయానికి కానిస్టేబుల్ గమనించడంతో..

ABN , First Publish Date - 2022-05-15T20:56:11+05:30 IST

ప్రయాణ సమయాల్లో కొందరు ఊరికే కంగారుపడుతుంటారు. సమయానికి గమ్యస్థానం చేరాలనే తొందరలో చాలా మంది తప్పులు చేసి, ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు...

Viral video: రైలు నుంచి పిల్లలతో పాటూ కిందకు దూకేసిన మహిళ.. సమయానికి కానిస్టేబుల్ గమనించడంతో..

ప్రయాణ సమయాల్లో కొందరు ఊరికే కంగారుపడుతుంటారు. సమయానికి గమ్యస్థానం చేరాలనే తొందరలో చాలా మంది తప్పులు చేసి, ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు అదృష్టవశాత్తు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడుతుంటారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటనలో ఓ మహిళ ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో బయటపడింది. కదులుతున్న రైలు నుంచి పిల్లల్ని కిందకు తోసేసింది. తర్వాత తాను కూడా గాబరాగా కిందకు దూకేసింది. అయితే సమయానికి కానిస్టేబుల్ గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.


Madhya pradesh రాష్ట్రం ఉజ్జయినీ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు ఎక్కింది. అయితే కంగారులో ఒక రైలు ఎక్కాల్సింది పోయి.. వేరే రైలు ఎక్కింది. రైలు కదులుతున్న సమయంలో గుర్తించి, ఎలాగైనా దిగేయాలనే తొందరలో ముందుగా పిల్లల్ని ఒకరి తర్వాత ఒకర్ని కిందకు తోసేసింది. అక్కడే ఉన్న రైల్వే పోలీసు గమనించి.. వారిని రక్షించి పక్కకు తీసుకెళ్లాడు. అంతలోనే మహిళ కూడా రైలు నుంచి కిందకు దూకేసింది.

చలనం లేకుండా పడి ఉన్న తల్లి పక్కన 6నెలల చిన్నారి ఒకటే ఏడుపు.. స్థానికులు కంగారుగా వెళ్లి చూడగా..


అయితే అదుపుతప్పి ఫ్లాట్‌పామ్‍‌కు, రైలుకు మధ్యలో పడుతుండగా... కానిస్టేబుల్ క్షణాల వ్యవధిలో స్పందించి రక్షించాడు. పెద్ద ప్రమాదం తప్పడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత మహిళకు సూచనలు చేసి పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారంతా కానిస్టేబుల్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఆకాశంలో ఉరుములు, మెరుపుల మధ్య దూసుకొచ్చిన భారీ ఇనుప బంతులు.. తీరా ఏంటా అని పరిశీలించగా..





Updated Date - 2022-05-15T20:56:11+05:30 IST