Viral Video: కోతి చేష్టలు అంటే ఇవే.. అద్దం ముందు నిలబడి ఈ కోతి ఏం చేసిందో మీరే చూడండి...
ABN , First Publish Date - 2022-06-23T03:11:26+05:30 IST
కోతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి చేసే పనులు చూస్తే.. కొన్నిసార్లు నవ్వు తెప్పించినా, చాలా సార్లు విసుగు తెప్పిస్తుంటుంది. గ్రామాల్లో వాటి బెడద తట్టుకోలేక ప్రజలు..
కోతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి చేసే పనులు చూస్తే.. కొన్నిసార్లు నవ్వు తెప్పించినా, చాలా సార్లు విసుగు తెప్పిస్తుంటుంది. గ్రామాల్లో వాటి బెడద తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడడం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో కోతులకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు నవ్వు తెప్పించేలా ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. అద్దం ముందు నిలబడి, కోతి చేసిన పని.. నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తోంది.
ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ జూలో అద్దాలతో ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో ఓ కోతి చేసిన పని.. నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. అద్దం ఎదుట నిలబడిన కోతి కొద్ది సేపు తనను తాను అద్దంలో చూసుకుంటుంది. తర్వాత ఓ రాయి తీసుకుని అద్దాన్ని దబేల్ మని కొడుతుంది. రెండు దెబ్బలు వేయగానే అద్దం ఒక్కసారిగా పగిలిపోతుంది. దీంతో ఆ కోతి.. వామ్మో! చచ్చాన్రో దేవుడో... అనుకుంటూ అక్కడి నుంచి పరుగందుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. కోతి చేష్టలు అంటే ఇవే.. అంటూ కొందరు చమత్కరిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి మరి.