నా మెసేజ్‌లకు రిప్లై ఎందుకు ఇవ్వలేదంటూ యువకుడి ప్రశ్న.. చివరకు స్నేహితులతో కలిసి నేరుగా వెళ్ళిన ప్రియుడు..
ABN , First Publish Date - 2022-08-29T03:06:15+05:30 IST
యువతీయువకుల మధ్య ఒక్కోసారి విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. కొందరు యువకులు యువకులు ప్రేమ పేరుతో చివరకు మోసం చేస్తుంటారు. అలాగే కొందరు..
యువతీయువకుల మధ్య ఒక్కోసారి విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. కొందరు యువకులు ప్రేమ పేరుతో చివరకు మోసం చేస్తుంటారు. అలాగే కొందరు యువకులు.. మొదట్లో ప్రేమించి, తర్వాత వివిధ కారణాలతో వారిని పక్కన పెడుతుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో యువకులు.. తాము ఆత్మహత్యలకు పాల్పడడమో, లేక ప్రియురాలిని హత్య చేయడమో చేస్తుంటారు. ఢిల్లీలో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నా మెసేజ్‌లకు ఎందుకు రిప్లై ఇవ్వలేదంటూ యువకుడు ప్రశ్నించాడు. అయినా యువతి స్పందించలేదు. దీంతో చివరకు స్నేహితులతో కలిసి నేరుగా ఆమె వద్దకే వెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
దక్షిణ ఢిల్లీలోని (Delhi) సంగమ్ విహార్ ప్రాంత పరిధికి చెందిన 16ఏళ్ల బాలిక.. స్థానికంగా ఉన్న కళాశాలలో ఇంటర్ చదువుతోంది. రెండేళ్ల క్రితం ఆమెకు సోషల్ మీడియాలో (Social media) అర్మాన్ అలీ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ చాటింగ్ చేసుకోవడం మొదలెట్టారు. ఈ క్రమంలో వారి మధ్య చనువు పెరిగింది. ఇటీవల రోజూ చాటింగ్‌లోనే గడిపేవారు. అయితే ఏం జరిగిందో తెలీదు గానీ.. ఉన్నట్టుండి అతన్ని బాలిక పట్టించుకోవడం మానేసింది. యువకుడు ఎన్ని మెసేజ్‌లు చేసినా బదులిచ్చేది కాదు. ఒక్కసారిగా ప్రియురాలు పట్టించుకోవడం మానేయడంతో కోపంతో రగిలిపోయాడు.
విద్యార్థుల ముందే బాలిక దుస్తులు విప్పించిన టీచర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
నా మెసేజ్‌లకు ఎందుకు రిప్లై ఇవ్వడం లేదంటూ పదే పదే ప్రశ్నించాడు. అయినా బాలిక మాత్రం స్పందించేది కాదు. దీంతో ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. గురువారం స్నేహితులను తీసుకుని నేరుగా ఆమె వద్దకే వెళ్లాడు. ఒక్కసారిగా బాలికపై తుపాకీతో కాల్పులు జరిపి బైకులో పరారయ్యారు. స్థానికులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.