వంట చేయకుండా ఇంతసేపు ఏం చేస్తున్నావ్.. అంటూ మండిపడ్డ భర్త... చివరకు భార్యకు బలవంతంగా..

ABN , First Publish Date - 2022-04-21T14:18:03+05:30 IST

సంసారం సవ్యంగా సాగే సమయంలో కొందరు చేజేతులా కుటుంబాలను నాశనం చేసుకుంటుంటారు. లేనిపోని అపోహలను సృష్టించుకుని.. చిన్న సమస్యలను కావాలని పెద్దవి చేసి...

వంట చేయకుండా ఇంతసేపు ఏం చేస్తున్నావ్.. అంటూ మండిపడ్డ భర్త... చివరకు భార్యకు బలవంతంగా..
ప్రతీకాత్మక చిత్రం

సంసారం సవ్యంగా సాగే సమయంలో కొందరు చేజేతులా కుటుంబాలను నాశనం చేసుకుంటుంటారు. లేనిపోని అపోహలను సృష్టించుకుని.. చిన్న సమస్యలను కావాలని పెద్దవి చేసి గొడవ పడుతుంటారు. చివరకు తాము ఆత్మహత్య చేసుకోవడమో.. లేక ఎదుటి వారిని హత్య చేయడమో చేస్తుంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త చిన్న సమస్యను పెద్దది చేసి, చివరకు దారుణానికి పాల్పడ్డాడు. అతడు చేసిన పని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్ జిల్లాలోని బిసౌది గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బల్లు కేవత్ అనే వ్యక్తి.. మంగళవారం తన అత్తగారి గ్రామమైన బిసౌదికి వచ్చాడు. రోజంతా భార్య, అత్తమామలతో సంతోషంగా గడిపాడు. అయితే రాత్రి భోజన సమయంలో అసలు గొడవ మొదలైంది. భోజనం చేయడంలో ఆలస్యం అవడంతో భర్తకు ఆగ్రహం వచ్చింది. వంట చేయకుండా ఇంతసేపు ఏం చేస్తున్నావ్... అంటూ భార్యపై మండిపడ్డాడు. ఇంత చిన్న విషయానికి అంత గొడవ ఎందుకు ఏం చేస్తున్నావ్.. అని భార్య వాదించడంతో అతడికి కోపం ఇంకా ఎక్కువైంది. నాకే ఎదురు చెబుతావా అంటూ అత్త ముందే భార్యపై దాడి చేశాడు.

6 నెలల గర్భిణి.. కత్తితో కడుపులో పొడుచుకుంది.. ఇంత దారుణానికి ఆమె పాల్పడటం వెనుక..


అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న ఎలుకల మందును బలవంతంగా భార్యకు తినిపించాడు. దీంతో అక్కడే ఉన్న బల్లు కేవత్ అత్త.. షాక్‌కి గురైంది. తర్వాత అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. తమ అల్లుడు చిన్న చిన్న సమస్యలకు కావాలనే గొడవ పెట్టుకుంటూ ఉంటాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇంటి ముందే ఆగిన స్కూల్ వ్యాన్.. ఫ్రెండ్స్‌కు టాటా చెప్పి దిగిన 4 ఏళ్ల పిల్లాడికి అదే ఆఖరి మాటయింది.. మరు క్షణంలోనే..

Updated Date - 2022-04-21T14:18:03+05:30 IST