ఆ ఇంటివాళ్లు డిన్నర్ చేస్తుంటే, తన డిన్నర్ మెనూలో వాళ్లనే ఎంచుకుందట…
ABN , First Publish Date - 2022-11-17T20:58:02+05:30 IST
ఆ కుటుంబం మొత్తం రాత్రి సమయంలో టీవీ చూస్తూ సంతోషంగా డిన్నర్ చేస్తోంది. అయితే మధ్యలో అలాంటి ఊహించని ఘటన చోటు చేసుకుంటుందని వారు కలలో కూడా ఊహించలేదు. ఉన్నట్టుండి వారి పిల్లి వంటింట్లోకి దూరింది. కాసేపటికి..
ఆ కుటుంబం మొత్తం రాత్రి సమయంలో టీవీ చూస్తూ సంతోషంగా డిన్నర్ చేస్తోంది. అయితే మధ్యలో అలాంటి ఊహించని ఘటన చోటు చేసుకుంటుందని వారు కలలో కూడా ఊహించలేదు. ఉన్నట్టుండి వారి పిల్లి వంటింట్లోకి దూరింది. కాసేపటికి లోపలి నుంచి ఏవో శబ్ధాలు వినిపించాయి. ఏంటా అని లోపలికి వెళ్లి చూడగా.. వారికి గుండె ఆగినంత పనైంది. వెంటనే ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని, రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
Viral Video: అమ్మబాబోయ్.. వీళ్లకెంత ధైర్యం.. మేకను మింగేందుకు సిద్ధమైన కొండ చిలువను ఏం చేశారంటే..
పూణెలోని (Pune) జున్నార్ పరిధి పింపాల్‌వాండి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న రాయ్‌కర్ అనే వ్యక్తి.. సోమవారం రాత్రి భార్య సంగీత, కొడుకు విక్రమ్‌తో కలిసి టీవీ చూస్తూ, భోజనం చేస్తున్నాడు. అంతా ఆనందంగా ఉన్న సమయంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో వారి ఇంట్లోని పిల్లి.. అకస్మాత్తుగా వంటింట్లోకి పరుగెత్తింది. ఏదైనా తినేందుకు వెళ్తుందేమో అని అంతా అనుకున్నారు. అయితే కాసేపట్లోనే లోపలి నుంచి ఏదో శబ్ధం వినిపించింది. ఏంటా అని చూసిన వారికి గుండె ఆగినంత పనైంది. వంట గదిలోకి ప్రవేశించిన పెద్ద పులి (tiger) ఒక్కసారిగా వీరిని చూసి గట్టిగా గాండ్రించింది. దీంతో వారికి కొద్ది సేపు కాళ్లు, చేతులు ఆడలేదు.
Zomato Food Delivery: రూ.362 రీఫండ్ కోసం జొమాటో పై కేసు.. ఈ విద్యార్థికి ఎంత పరిహారం దక్కిందంటే..!
తర్వాత ఎలాగోలా ఓ గదిలోకి పరుగెత్తి తలుపులు వేసుకున్నారు. రాత్రంతా లోపలే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉదయం మెల్లగా తలుపులు తీసి చూస్తే పులి కనిపించలేదు. తర్వాత తమకు ఎదురైన అనుభవాన్ని అధికారులకు వివరించాడు. తమ గ్రామం పూణేకు 90కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో (Forest area) ఉందని చెప్పాడు. గ్రామంలోని ఇళ్లలోకి తరచూ క్రూర జంతువులు (wild animals), విష సర్పాలు (snakes) ప్రవేశిస్తున్నాయని చెప్పాడు. చాలా మంది డబ్బులు లేక.. ప్రహరీలు నిర్మించుకోలేదని, దీంతో పులులు, సింహాలు సులువుగా ఇంట్లోకి చొరబడుతున్నాయని వాపోయాడు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమ ఇళ్ల చుట్టూ రక్షణ గోడలు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేయాలని వేడుకున్నాడు. దీనిపై అటవీ అధికారులు మాట్లాడుతూ.. క్రూర జంతువుల బెడద గురించి గ్రామస్తులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించామని చెప్పారు. అయితే రక్షణ గోడల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త.. సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
నా భార్యను చంపేశా.. వచ్చి అరెస్ట్ చేసుకోండంటూ నేరుగా పోలీసులకే ఫోన్ చేసిన భర్త..!