Tornado: సముద్రం మధ్యలో టోర్నడో
ABN , First Publish Date - 2022-12-28T10:17:23+05:30 IST
హఠాత్తుగా మేఘాలు సముద్రం వైపు చేరడం, సముద్రం నీరు సుడులు తిరుగుతూ మేఘాల్లోకి వెళ్లే దృశ్యాలు
- ‘నీటి తొట్టె’గా పేర్కొన్న హార్బర్ అధికారులు
పెరంబూర్(చెన్నై), డిసెంబరు 27: హఠాత్తుగా మేఘాలు సముద్రం వైపు చేరడం, సముద్రం నీరు సుడులు తిరుగుతూ మేఘాల్లోకి వెళ్లే దృశ్యాలు ఆ ప్రాంతంలో చేపలు పడుతున్న జాలర్లను దిగ్ర్భాంతికి గురయ్యారు. విల్లుపురం(Villupuram) జిల్లా మరక్కాణం సమీపం అలంపారై ప్రాంత జాలర్లు సోమవారం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఆ సమయంలో హఠాత్తుగా మేఘాలు ఆకాశం నుంచి సముద్రం వైపుకు దిగాయి. కొద్ది సమయంలో సముద్రపు నీరు సుడులు తిరుగుతూ మేఘాల్లోకి చేరింది. అది చూసిన జాలర్లు భయభ్రాంతులు చెందారు. సుమారు అరగంట పాటు సముద్రపు నీటిని మేఘాలు పీల్చుకొనే దృశ్యాలను జాలర్లు తన సెల్‌ఫోన్‌లో బంధించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ ఛల్ చేస్తున్నాయి. ఈ విషయమై హార్బర్ అధికారులు స్పందిస్తూ, సముద్రం మీదుగా వీచే గాలి చల్లగా ఉండి, సముద్రపు గాలి వెచ్చగా ఉంటే ‘నీటి తొట్టె’గా పిలిచే ఈ అద్భుతం సముద్రంలో ఏర్పడుతుందన్నారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు వాతావరణం మార్పులు చోటుచేసుకొనే సమయంలో సంభవిస్తుంటాయన్నారు. రెండు గాలుల ఉష్ణోగ్రతలు మళ్లీ సమానంగా మారినపుడు ఈ నీటి పట్టిక అదృశ్యమవుతుందన్నారు. ఈ సమయంలో సముద్రపు నీరు వేగంగా గ్రహించబడి మేఘంగా మారుతుంది. ఈ సంఘటనను ఆంగ్లంలో ‘టోర్నడో’ (Tornado) అంటారని తెలిపారు. ఇలాంటి దృశ్యాలు ఐరోపా తదితర ప్రాంతాల్లో అధికంగా సంభవిస్తుంటాయని అధికారులు పేర్కొన్నారు.