Florida Lockdown: ఆ చిన్న ప్రాణికి.. అమెరికానే వణికింది.. రెండేళ్ల పాటు కొత్త తరహా లాక్‌డౌన్..

ABN , First Publish Date - 2022-07-16T21:15:54+05:30 IST

అమెరికా(America)లోని ఫ్లోరిడా నగరం ఇప్పుడు నత్తలను చూసి గజగజ వణుకుతోంది. నత్తల(snails) కారణంగా అక్కడ అధికారులు కొత్త తరహా లాక్‌డౌన్ ఆంక్షలు విధించారు...

Florida Lockdown: ఆ చిన్న ప్రాణికి.. అమెరికానే వణికింది.. రెండేళ్ల పాటు కొత్త తరహా లాక్‌డౌన్..

అమెరికా(America)లోని ఫ్లోరిడా నగరం ఇప్పుడు నత్తలను చూసి గజగజ వణుకుతోంది. నత్తల(snails) కారణంగా అక్కడ అధికారులు కొత్త తరహా లాక్‌డౌన్ ఆంక్షలు విధించారు. సాధారణంగా నత్తలు నీటిలో జీవిస్తాయి. కానీ జెయింట్‌ ఆఫ్రికన్ ల్యాండ్‌ స్నెయిల్‌(African land snail) జాతికి చెందిన నత్తలు నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, ఆకులు తింటూ జీవిస్తాయి. తొమ్మిదేళ్ల పాటు జీవించే ఈ నత్తలు ఎనిమిది అంగుళాల పొడవుంటాయి.


ఫ్లోరిడాలో ఈ రాకాసి నత్తల సంతతి ఒక్కసారిగా పెరగడం భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ నత్తలు.. దాదాపు 500 రకాల మొక్కలను తింటాయి. అందువల్ల ఈ నత్తలు ఉన్న చోట పంటలు తీవ్రంగా పాడవుతున్నాయి. ఇక వీటిపై ఉండే సూక్ష్మజీవుల కారణంగా మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధి(disease) వస్తున్నట్టు గుర్తించారు.  ఈ నత్తలు కాంక్రీట్‌ను కూడా తింటాయని.. దీంతో భవనాలు, ఇతర నిర్మాణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని అమెరికా వ్యవసాయ శాఖ ప్రకటించింది.

Viral Video: నడి రోడ్డులో ఇద్దరు యువతుల కొట్లాట.. అసలు కారణం తెలుసుకుని అవాక్కవుతున్న నెటిజన్లు..


ఇప్పుడు అమెరికాకు ఆఫ్రికన్ జెయింట్ నత్తలు పెద్ద సమస్యగా మారాయి. పోర్ట్‌ రిచీ పట్టణంలో జెయింట్ నత్తలను అధికారులు గుర్తించారు. ఈ నత్తల గుడ్లు మట్టి, మొక్కలు, కలప తరలింపు ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉండడంతో ఆ ప్రాంతంలో రెండేళ్ల పాటు కొత్త తరహా లాక్‌డౌన్(Lockdown) పెట్టారు. ఆ ప్రాంతం నుంచి ఎలాంటి మొక్కలు, మట్టి, చెత్త,  భవన నిర్మాణ సామగ్రి, పంటలకు సంబంధించిన ఎలాంటి ఉత్పత్తులు, సామగ్రిని బయటికి తీసుకెళ్లకుండా నిషేధం విధించారు.

అశ్లీల వీడియోలు చూస్తుండగా.. మధ్యలో Popup notification.. ఓపెన్ చేసిన కాసేపటికి యువతి నుంచి ఫోన్.. చివరకు..



Updated Date - 2022-07-16T21:15:54+05:30 IST