వాళ్లకు అసలు బుద్ధుందా..? అంటూ ఈ 8 ఏళ్ల పిల్లాడి తల్లిదండ్రులపై నెటిజన్ల ఫైర్.. ఈ వీడియోను చూస్తే..

ABN , First Publish Date - 2022-04-26T14:58:02+05:30 IST

నేటి కంప్యూటర్ యుగంలో పిల్లలు తెలివిమీరిపోయారు. కొందరు పిల్లలు చదువులో అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు...

వాళ్లకు అసలు బుద్ధుందా..? అంటూ ఈ 8 ఏళ్ల పిల్లాడి తల్లిదండ్రులపై నెటిజన్ల ఫైర్.. ఈ వీడియోను చూస్తే..

నేటి కంప్యూటర్ యుగంలో పిల్లలు తెలివిమీరిపోయారు. కొందరు పిల్లలు చదువులో అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మరికొందరు పిల్లలు స్మార్ట్ ఫోన్ మాయలో పడి చదువును పక్కన పెడుతున్నారు. ఇంకొందరైతే ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందే.. పాకిస్థాన్‌లో ఓ బాలుడు చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. పిల్లాడి తల్లిదండ్రులకు అసలు బుద్ధుందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పాకిస్థాన్‌కు చెందిన 8ఏళ్ల బాలుడు తన సోదరితో కలిసి టయోటా ఫార్చ్యూనర్‌ కారు వద్ద నిలబడి ఉంటారు. మరోవైపు ఫోన్‪‌లో వీడియో తీస్తూ ఉంటారు.  ”8 ఏళ్ల పిల్లవాడు కారును ఎలా డ్రైవ్ చేయవచ్చో మేము చూపిస్తాం’’ అంటూ కారులో కూర్చుంటారు. కాళ్లు కూడా సరిగా అందకపోయినా.. సీటు ముందు భాగంలో కూర్చుని కారును స్టార్ట్ చేస్తాడు. మరో వైపు బాలుడి సోదరి వీడియో తీస్తూ ఉంటుంది. కారును ఎలా నడపాలో వివరిస్తూ డ్రైవ్ చేయడం చూస్తే.. ఎక్కడ ప్రమాదానికి గురవుతారో అనే ఆందోళన కలుగుతుంది. కానీ ఆ బాలుడు మాత్రం కారును సునాయాసంగా నడిపేస్తాడు.

నీతో అస్సలు రానంటూ భర్తకు తేల్చిచెప్పిన భార్య.. కాసేపటికే పరుగెత్తుకు వచ్చి పిల్లలు చెప్పింది విని..


ఇందుకు సంబంధించిన వీడియోను తమ య్యూటూబ్ చానల్‌లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. అయితే బాలుడికి కారును ఇవ్వడంతో పాటూ ఎలాంటి నిబంధనలు పాటించకుండా డ్రైవింగ్ చేయించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పిల్లాడిని తల్లిదండ్రులే ప్రమాదంలో పడేస్తుంటారంటూ కొందరు.. చట్టవిరుద్ధమైన ఇలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించవద్దని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

కూతుర్ని బస్సు ఎక్కించి వచ్చిన తండ్రి.. ఇంట్లో నగ్నంగా వంట చేస్తున్న గుర్తు తెలియని మహిళను చూసి షాక్.. చివరకు..



Updated Date - 2022-04-26T14:58:02+05:30 IST