Viral Video: ఇలాక్కూడా ఇస్త్రీ చేస్తారా.. ఇతను బట్టలను Iron చేసే విధానం చూస్తే.. వామ్మో! అని అంటారు..
ABN , First Publish Date - 2022-07-09T02:26:59+05:30 IST
కొందరు వారి రోజూ వారీ పనుల్లో విపరీతమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉంటాం. హోటల్లో గోధుమపిండిని కాళ్లతో తొక్కడం..
కొందరు వారి రోజూ వారీ పనుల్లో విపరీతమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉంటాం. హోటల్లో గోధుమపిండిని కాళ్లతో తొక్కడం, పానీపూరీ నిర్వాహకులు అందులో మురుగు నీరు కలపడం.. ఇలాంటి ఘటనలు ఎక్కడో చోట తరచూ జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ పెద్దాయన దుస్తులను ఇస్త్రీ చేసే విధానం చూసి.. నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా బట్టలను ఎలా ఇస్త్రీ చేస్తారు. ఉతికిన తర్వాత.. ఆరిపోయిన బట్టలపై కాస్త నీళ్లు చిలకరించిన అనంతరం ఇస్త్రీ పెట్టెతో చక్కగా ఐరన్ చేస్తారు. ఇలా చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఓ పెద్దాయన.. అందుకు పూర్తి విరుద్ధంగా చేశాడు. అందరిలా చేయడం కామన్.. ఏదైనా కొత్తగా చేద్దామనుకున్నాడో ఏమో, మొత్తానికి చాలా వెరైటీగా ఇస్త్రీ చేశాడు. ముందుగా బొగ్గుల ఐరన్ బాక్స్‌ను, పక్కన పాత్రలో నీళ్లను సిద్ధంగా పెట్టుకున్నాడు. తర్వాత ఓ చొక్కాను తీసుకుని, దానిపై చేత్తో నీళ్లు పిచికారీ చేయాల్సింది పోయి.. వెరైటీగా నోటితో స్ప్రే చేశాడు. పలుమార్లు నీళ్లను నోట్లో పోసుకుని.. స్పీడ్‌గా చొక్కాపై పిచికారీ చేశాడు. తర్వాత బాక్సు తీసుకుని ఐరన్ చేశాడు. ఈయన చేసిన ఘనకార్యాన్ని పక్కనే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్తా.. ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.