Viral News: భార్యకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ రావడంతో ఓ భర్త నిర్ణయం.. షాక్ లో భార్య..
ABN , First Publish Date - 2022-12-15T10:58:02+05:30 IST
ఇంటిపట్టునే ఉంటూ హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చని ఆశపడిన ఆమెకు ఆమె భర్త పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు..
వారిద్దరికీ పెళ్ళయ్యింది. పెళ్ళికి ముందే అతను రెండు పడకగదుల ఇల్లు కొన్నాడు. పెళ్ళికి ముందు ఆమెకు ఎలాంటి ఉద్యోగం లేదు. విద్యార్హతకు తగ్గట్టు ప్రయత్నించగా ఆమెకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం లభించింది. ఇంటిపట్టునే ఉంటూ హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చని ఆశపడిన ఆమెకు ఆమె భర్త పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.. ఇంతకూ అతను ఏమన్నాడు ఆమె ఎందుకంత షాకయింది వంటి వివరాలలోకి వెళితే..
తనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం రావడంతో ఎంతో సంతోషపడిన భార్య భర్త దగ్గరకు వెళ్ళి విషయం చెప్పింది. అయితే ఆ భర్త మాత్రం ఆమెను ప్రక్కన కూర్చోబెట్టుకుని 'చూడు నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం రావడం నాకేం సమస్య లేదు. నేను ఆల్రెడీ ఒక గదిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాను. మనకున్న గదిలో కూర్చుని నువ్వు వర్క్ చేసుకోవాలంటే రూమ్ అద్దెగా నెల నెలా నీకు వచ్చే సాలరీలో 30శాతం ఇవ్వాలి' అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె విస్తుపోయింది. ఇందేంటి నేను గదికి అద్దె కట్టడం ఎందుకు? అని ప్రశ్నించింది.
'ఎందుకంటే ఈ ఇల్లు నాది, దీన్ని పెళ్ళికి ముందే నేను కొన్నాను. నువ్వు గదిలో వర్క్ చేసుకోవాలంటే నాకు అద్దెగా నీ సాలరీలో 30శాతం ఇవ్వాల్సిందే' అని తెగేసి చెప్పాడు. ఆ మహిళకు కోపం వచ్చి 'నేను నా సాలరీలో ఒక్క రుపాయి కూడా ఇవ్వను' అని తేల్చి చెప్పేసింది. అంతటితో ఆగకుండా తనకు ఎదురైన అనుభవం మొత్తాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆమె గురించి విన్న చాలా మంది 'అతనికి అద్దె చెల్లించేయండి' అని సలహా ఇచ్చారు. మరికొందరు 'మీరు అతనికి పనిమనిషి కాదు, భార్య. ఆ విషయాన్ని మరచిపోకండి' అని అన్నారు. మరికొందరు అయితే 'మీది వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా మీరు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకోండి' అని స్పందించారు.
మొత్తానికి ఈ భార్యా భర్తలది ఏ ప్రాంతమో తెలియదు కానీ వీళ్ళ వ్యవహారం నెట్టింట్లో వైరల్ గా మారింది. దీని గురించి విన్న వారందరూ చివరికి భార్యా భర్తలు కూడా పక్కా కమర్షియల్ అయిపోయారు అంటున్నారు.