భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్.. ఇంటికి వెళ్లాక అనుమానంతో రహస్యంగా ఆమె వాట్సప్ చాటింగ్‌ను చూసిన భర్తకు..

ABN , First Publish Date - 2022-06-18T01:25:12+05:30 IST

దంపతులు చేసే తప్పులు సరిదిద్దుకునేవిగా ఉండాలే గానీ.. ఏకంగా దాంపత్య జీవితానికే ముప్పు తెచ్చేవిగా ఉండకూడదు. కొన్నిసార్లు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు.. తెలిసి తెలిసి తప్పులు..

భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్.. ఇంటికి వెళ్లాక అనుమానంతో రహస్యంగా ఆమె వాట్సప్ చాటింగ్‌ను చూసిన భర్తకు..
ప్రతీకాత్మక చిత్రం

దంపతులు చేసే తప్పులు సరిదిద్దుకునేవిగా ఉండాలే గానీ.. ఏకంగా దాంపత్య జీవితానికే ముప్పు తెచ్చేవిగా ఉండకూడదు. కొన్నిసార్లు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు.. తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. అవి కూడా ఏ భర్తా, ఏ భార్యా చేయరాని తప్పులు చేసి.. చివరకు జీవితాలను సర్వనాశనం చేసుకుంటుంటారు. మహారాష్ట్రలో ఇలాగే జరిగింది. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది. దీంతో ఇంటికి వెళ్లి.. ఆమె వాట్సప్ చాటింగ్ చూశాడు. అందులోని సందేశాలు చూసి షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..


మహారాష్ట్ర నాగ్‌పూర్ పరిధికి చెందిన దంపతులు.. నాలుగేళ్ల కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త టెలికమ్యూనికేషన్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు. విధుల నిమిత్తం తరచూ వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాడు. భార్య, పిల్లలను ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. ఇటీవల భార్యకు కారు, ఖరీదైన మొబైల్‌ను  బహుమతిగా ఇచ్చాడు. అప్పటి నుంచి అతడి కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. భర్త పని మీద బయటికి వెళ్లే క్రమంలో.. అతడి భార్యకు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తితో సహా మరికొందరితో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. రోజూ వారితో ఫోన్‌లో మాట్లాడటంతో పాటూ వాట్సప్ చాటింగ్ కూడా చేసేది. వారి మీద ప్రేమతో భర్తకు ఫోన్ చేయడం కూడా మానేసింది. ఎప్పుడు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో దూరంగా ఉంటున్న భర్తకు అనుమానం వచ్చింది.

అవును.. 19 ఏళ్ల నా కూతుర్ని నేనే చంపేశా.. కానీ ఆమె మేలు కోరే చేశానంటూ.. ఓ తల్లి వింత వాదన వెనుక కథేంటంటే..


ఇటీవల ఓ రోజు ఇంటికి రాగానే.. భార్య ఫోన్‌ను పరిశీలించాడు. దీంతో వివిధ వ్యక్తులతో చేసిన చాటింగ్ వివరాలన్నీ బయటపడ్డాయి. అలాగే వారిలో ఓ వ్యక్తితో గర్భం దాల్చినట్లు కూడా తెలిసింది. దీంతో ఒక్కసారిగా షాకైన భర్త.. కోపంతో కూతురును తన వద్ద ఉంచుకుని, భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త దూరమవుతున్నాడనే బాధలో, తనపై అత్యాచారం జరిగిందని మొదట పోలీసుల వద్ద బుకాయించింది. అయితే విచారణ అనంతరం నిజం ఒప్పుకొంది. చివరకు తన భర్త చాలా మంచివాడని, భర్తతో ఉండే అవకాశం కల్పించాలని పోలీసుల వద్ద వేడుకుంది. అపరిచిత వ్యక్తులను నమ్మి మోసవపోవద్దంటూ పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

జైలు నుంచి రిలీజ్ అవుతున్న స్నేహితుడికి స్వాగతం.. పబ్లిక్ న్యూసెన్స్ అంటూ 83 మంది అరెస్ట్.. వారిలో 33 మంది ఎవరో తెలిసి..

Updated Date - 2022-06-18T01:25:12+05:30 IST