Viral Video: 20 అడుగుల లోతైన డ్రైనేజీ గుంటలో పడిపోయిన చిన్నారి.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా దూకేసిన తల్లి..!

ABN , First Publish Date - 2022-05-25T22:20:42+05:30 IST

పిల్లల సంక్షేమమే తన సంక్షేమంగా బతుకుతుంది తల్లి. అందుకే మాతృ ప్రేమకు మరేదీ సాటి రాదని పెద్దలు అంటుంటారు. కొడుకు ఎంత పెద్ద వాడైనా తల్లికి మాత్రం చిన్నపిల్లాడిలాగే..

Viral Video: 20 అడుగుల లోతైన డ్రైనేజీ గుంటలో పడిపోయిన చిన్నారి.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా దూకేసిన తల్లి..!

పిల్లల సంక్షేమమే తన సంక్షేమంగా బతుకుతుంది తల్లి. అందుకే మాతృ ప్రేమకు మరేదీ సాటి రాదని పెద్దలు అంటుంటారు. కొడుకు ఎంత పెద్ద వాడైనా తల్లికి మాత్రం చిన్నపిల్లాడిలాగే కనిపిస్తుంటాడు. తన పిల్లలకు చిన్న ఆపద వచ్చిందంటే తల్లడిల్లిపోతుంది. అవసరమైతే తన ప్రాణాలను ఫణంగా పెట్టయినా పిల్లలను కాపాడుకుంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. 20 అడుగుల లోతైన డ్రైనేజీ గుంటలో పడిపోయిన తన కొడుకును రక్షించుకునేందుకు ఓ మహిళ పెద్ద సాహసమే చేసింది. క్షణం ఆలస్యం చేయకుండా గుంటలోకి దూకేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


యునైటెడ్ కింగ్‌డమ్‌ కెంట్‌లోని యాష్‌ఫోర్డ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అమీ బ్లైత్ అనే మహిళ ఆదివారం తన 18నెలల చిన్నారిని తీసుకుని నడుచుకుంటూ వెళ్తుంటుంది. కొంత దూరం వెళ్లగానే ఎదురుగా ఓ మ్యాన్‌హోల్ ఉంటుంది. దాన్ని దాటి మరికొంత దూరం వెళ్లగానే చిన్నారి సడన్‌గా ఆగుతాడు. వెనక్కు వచ్చి మ్యాన్‌హోల్ వద్ద పరిశీలిస్తుంటాడు. అదే సమయంలో గుంట మీద ఉన్న మూత దెబ్బతినడం వల్ల బాలుడు అందులో పడిపోతాడు. అక్కడే ఉన్న బాలుడి తల్లి ఇదంతా గమనిస్తుంటుంది. కొడుకు గుంటలో పడిపోగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే క్షణం ఆలస్యం చేయకుండా వేగంగా వచ్చి, 20 అడుగుల లోతైన మ్యాన్‌హోల్‌లోకి దిగి.. అంతే వేగంగా చిన్నారిని బయటకు తీస్తుంది.

అబార్షన్‌కు అనుమతి కోసం హైకోర్టు‌కు ఓ యువతి.. ఆమె చెప్పిన నిజాలు విని నివ్వెరపోయిన న్యాయమూర్తి.. చివరకు..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అవుతుంది. బ్లైత్ ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రైనేజీ వ్యర్థాలతో నిండిన తన కుమారుడి దుస్తులను కూడా షేర్ చేస్తూ.. ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. వీడియో వైరల్ అవడంతో ఈ విషయం సదరు అధికారుల వరకు వెళ్లింది. దీనిపై అమీ బ్లైత్ కుటుంబానికి క్షమాపణ చెబుతూ.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

ఈ ఫొటోలోని బాలికను చూశారా..? రెండు మూడేళ్ల వయసే ఉంటుందనుకుంటున్నారా..? అసలు నిజమేంటో తెలిస్తే..





Updated Date - 2022-05-25T22:20:42+05:30 IST