ఒకరికొకరు నచ్చడంతో త్వరలో పెళ్లి చేయాలనుకున్నారు. రోజూ కాబోయే భర్తతో మాట్లాడుతున్న యువతి.. చివరకు ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు..

ABN , First Publish Date - 2022-07-02T21:47:14+05:30 IST

ఆ యువతి కుటుంబ సభ్యులు మూడేళ్ల క్రితం.. ఓ యువకుడితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఇరువైపుల వారికి నచ్చడంతో మంచి ముహూర్థం చూసి, పెళ్లి చేయాలని అనుకున్నారు. ఎలాగూ..

ఒకరికొకరు నచ్చడంతో త్వరలో పెళ్లి చేయాలనుకున్నారు. రోజూ కాబోయే భర్తతో మాట్లాడుతున్న యువతి.. చివరకు ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు..
ప్రతీకాత్మక చిత్రం

ఆ యువతి కుటుంబ సభ్యులు మూడేళ్ల క్రితం.. ఓ యువకుడితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఇరువైపుల వారికి నచ్చడంతో మంచి ముహూర్థం చూసి, పెళ్లి చేయాలని అనుకున్నారు. ఎలాగూ కాబోయే భర్త కావడంతో ఆమె రోజూ అతడితో ఫోన్‌లో మాట్లాడేది. అయితే ఓ రోజు నేరుగా ఇంటికే వస్తా అని చెప్పడంతో ఓకే చెప్పింది. అయితే చివరకు అతను చేసిన నిర్వాకానికి.. యువతి కుటుంబం ప్రస్తుతం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని నంద్‌పురి పరిధిలో నివాసం ఉంటున్న 30ఏళ్ల యువతి ఎంబీఏ పూర్తిచ చేసి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇంట్లో వారు మాత్రం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవారు. కానీ యువతి మాత్రం ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేసుకుంటానని చెప్పేది. అయినా ఆమె కుటుంబ సభ్యులు వినిపించుకోకుండా మూడేళ్ల క్రితం అజయ్ అనే యువకుడితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఇద్దరికీ నచ్చడంతో త్వరలో మంచి ముహూర్థం చూసి, పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదిలావుండగా, పెళ్లి చూపులు చూసిన అనంతరం యవతికి ఓ రోజు అజయ్ ఫోన్ చేశాడు. ఎలాగూ కాబోయే భర్తే కావడంతో ఆమె కూడా రోజూ మాట్లాడుతూ ఉండేది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతికి కాల్ చేసి, మీ ఇంటికి వస్తున్నా.. అని చెప్పాడు. దీంతో ఆమె కూడా అంగీకరించింది. అక్కడికి వెళ్లిన అజయ్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

దుస్తులు కొని Google Pay ద్వారా డబ్బులు చెల్లించిన బాలిక.. మరుసటి రోజే ‘‘ఐ లవ్ యూ’’ అంటూ యువకుడి మెసేజ్.. చివరకు..


త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి కూడా అభ్యంతరం చెప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న యువకుడు... తరచూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఏళ్లు గడుస్తున్నా పెళ్లి ప్రస్తావన వస్తే మాత్రం.. మాట దాటేస్తుండడంతో యువతితో పాటూ కుటుంబ సభ్యులకు కూడా అనుమానం వచ్చింది. ఇటీవల ఓ రోజు ఇదే విషయమై అజయ్‌ను యువతి నిలదీసింది. దీంతో ఆగ్రహానికి గురైన అజయ్.. ఆమెను బెదిరించి మరీ అఘాయిత్యానికి పాల్పడేవాడు. అజయ్‌లో ఎంతకీ మార్పు రాకపోవడంతో మూడు రోజుల క్రితం యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

రండి మేడమ్! మేము లిఫ్ట్ ఇస్తాం.. అంటూ తల్లీకూతుళ్లను కారు ఎక్కించుకున్నారు.. కాస్త ముందుకు వెళ్లగానే..

Updated Date - 2022-07-02T21:47:14+05:30 IST