Wife's shocking plan: నా భర్తను చంపేశారా! అంటూ కిల్లర్లకు భార్య ఫోన్.. చంపేంత ధైర్యం లేక.. చివరకు భర్తతో కలిసి వారు ఆడిన డ్రామాతో..
ABN , First Publish Date - 2022-08-21T02:50:47+05:30 IST
వివాహేతర సంబంధాలతో (Extramarital affairs) కొందరు చివరకు జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. జీవితాంతం అదే సుఖం కావాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు చివరకు..
వివాహేతర సంబంధాలతో (Extramarital affairs) కొందరు చివరకు జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. జీవితాంతం అదే సుఖం కావాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు చివరకు దారుణాలకు తెగబడుతుంటారు. భర్తలను చంపేందుకు భార్యలు, భార్యలను చంపేందుకు భర్తలు వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. బెంగళూరులో (Bangalore) ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నా భర్తను చంపేశారా.. అంటూ కిల్లర్లకు భార్య ఫోన్ చేసింది. అయితే చంపేందుకు ధైర్యం చాలక.. చివరకు భర్తతో కలిసి కిల్లర్లు ఆడినా డ్రామాతో.. చివరకు అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బెంగళూరు పరిధిలోని దొడ్డబిదరకల్లు పరిధిలో అనుపల్లవి, నవీన్‌కుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవీన్ ఓ మిల్లు నడుపుతూనే క్యాబ్ డ్రైవర్‌గా (Cab driver) కూడా పని చేస్తున్నాడు. ఇదిలావుండగా, అనుపల్లవికి ఇటీవల హిమవంత్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త లేని సమయంలో ప్రియుడితో కలుస్తూ ఉండేది. అయితే భర్త అడ్డు తొలగించుకుంటే.. రోజూ ప్రియుడితో ఉండొచ్చని భావించింది.
Shocking case like Bilkis Bano: 217 మంది అమాయకుల ప్రాణాలను తీసేసిన ఈ కిరాతకుడు జైలు నుంచి బయటకు..!?
ఇదే విషయంపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. చివరకు భర్తను చంపేందుకు కొందరు కిల్లర్లతో రూ.1.1 లక్షలకు ఒప్పందం చేసుకుంది. అడ్వాన్స్‌గా రూ.90 వేలు చెల్లించింది. పథకం ప్రకారం నవీన్ క్యాబ్ బుక్ చేసుకున్న కిల్లర్లు.. అతన్ని కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. అయితే చంపడానికి ధైర్యం చాలక.. చివరకు అతడికి అసలు విషయం చెప్పేశారు. అనంతరం అంతా కలిసి డ్రామా ఆడారు. నా భర్తను చంపేశారా.. అంటూ భార్య ఫోన్ చేసింది. అలాగే తనకు చంపినట్లుగా ఫొటో తీసి పంపాలని చెప్పింది. దీంతో నవీన్‌పై రెడ్ కలర్ వేసి.. అనంతరం ఫొటోను భార్యకు పంపించారు.
పెళ్లయిన మహిళతో ప్రేమ.. బైకులో ఎక్కించుకుని వెళ్తూ... స్నేహితుడికి ఫోన్ చేసిన తర్వాత వారు చేసిన పని..
ఈ ఫొటో చూడగానే అనుపల్లవి ప్రియుడు.. భయంతో తన ఇంట్లో ఆగస్టు 1న ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్ సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనుపల్లవిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందుకు సహకరించిన అనుపల్లవి తల్లితో పాటూ కిల్లర్లను అరెస్ట్ చేశారు. ఇంత జరిగిన నవీన్ కుమార్ మాత్రం.. తన భార్య అంటే ఇష్టమని, క్షమించి వదిలేయాని పోలీసులకు విన్నవించాడు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.