ఆన్‌లైన్ షాపింగ్ మొదలుకొని, ఉత్తరాలు పంపేవరకూ పిన్‌కోడ్‌ను ఎందుకు ఉపయోగిస్తారు? ఈ నంబర్ వెనుకనున్న రహస్యం ఇదే...
ABN , First Publish Date - 2022-10-15T14:51:42+05:30 IST
ఒకప్పుడు జనం తమ ప్రియతములకు ఉత్తరాలను...
ఒకప్పుడు జనం తమ ప్రియతములకు ఉత్తరాలను పోస్ట్ చేసేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. కమ్యూనికేషన్ విప్లవం నడుస్తోంది. పోస్టల్ సర్వీస్ ఇప్పుడు కూడా ఉంది. అయితే ఉత్తరాలు పంపే కాలం గతించిపోయింది. తపాలా సేవలు ఇప్పటికీ వినియోగమవుతున్నాయి. ఆన్‌లైన్ డెలివరీ ద్వారా వస్తువులను ఆర్డర్ చేసే విధానంలో పిన్ కోడ్ అత్యంత ముఖ్యమైనది. అయితే ఏ ప్రదేశానికి సంబంధించిన పిన్‌కోడ్‌ను ఎలా నిర్ణయిస్తారో? ఆ సంఖ్యల అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పిన్‌కోడ్ అంటే 'పోస్టల్ ఇండెక్స్ నంబర్ కోడ్'. ఇది తొలిసారిగా 1972 ఆగస్టు 15న ప్రారంభమైంది. భారతదేశంలో పిన్ కోడ్‌లో మొత్తం 6 సంఖ్యలు ఉంటాయి. దీనిలోని ప్రతిసంఖ్యకు ఒక ప్రత్యేక అర్ధం ఉంటుంది. ఇది ప్రాంతం, జిల్లా, పోస్టాఫీసుతో ముడిపడివుంటుంది. మొదటి అంకె ప్రాంతాన్ని సూచిస్తుంది. భారతదేశంలో మొత్తం 9 పిన్ కోడ్‌లు ఉన్నాయి. ఈ 9 పిన్ కోడ్ ప్రాంతాలలో ప్రారంభ సంఖ్య అయిన 8 సాధారణ భౌగోళిక స్థానాన్ని సూచిస్తుండగా, 9 అంకె ఆర్మీ పోస్టల్ సర్వీస్ కోసం ఉపయోగిస్తారు. ఉపప్రాంతాన్ని పిన్ కోడ్‌లోని రెండవ అంకె సూచిస్తుంది. పిన్ కోడ్‌లోని మొదటి రెండు అంకెలు ఆ ప్రాంతంలోని నిర్దిష్ట సర్కిల్‌ను గుర్తిస్తాయి. ఉదాహరణకు, మనం ఢిల్లీని తీసుకుంటే ఇక్కడ మొదటి రెండు అంకెలు 11. పిన్ కోడ్‌లోని మూడవ అంకె ప్రాంతం పరిధిలోని జిల్లాకు సంబంధించినదైవుంటుంది. పిన్‌కోడ్‌లోని చివరి మూడు అంకెలు జిల్లాలోని నిర్దిష్ట పోస్టాఫీసును సూచిస్తాయి. ఇది ప్రభుత్వ కార్యాలయాల నుండి వస్తువుల పంపిణీకి పిన్‌కోడ్ ను ఉపయోగిస్తుంటారు.