నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేసిన యువకుడు... కొన్ని రోజులకు హత్యకు గురైన ప్రియురాలు, తల్లిదండ్రులు.. అసలు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-27T13:25:43+05:30 IST

ప్రేమ వ్యవహారాల విషయంలో ఎప్పుడు ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. కొందరు ప్రేమికులు.. అందరినీ ఎదిరించి, తమ ప్రేమను పెళ్లి వరకు..

నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేసిన యువకుడు... కొన్ని రోజులకు హత్యకు గురైన ప్రియురాలు, తల్లిదండ్రులు.. అసలు ఏం జరిగిందంటే..

ప్రేమ వ్యవహారాల విషయంలో ఎప్పుడు ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. కొందరు ప్రేమికులు.. అందరినీ ఎదిరించి, తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తుంటారు. మరికొందరు ప్రేమికులు తమ ప్రేమను త్యాగం చేయలేక.. చివరకు తమ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు. అయితే ఇదే ప్రేమ పేరుతో కొందరు యువకులు.. బాలికలు, యువతులను వేధిస్తుంటారు. ప్రేమను ఒప్పుకోకపోతే చివరకు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. ఉత్తరప్రదేశ్‌లో ఓ విషాధ ఘటన చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నానంటూ ఓ యువకుడు లవ్ ప్రపోజల్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ప్రియురాలు, ఆమె తల్లిదండ్రులు హత్యకు గురయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గామనిషాద్(42), సంజు నిషాద్(38) దంపతులకు ప్రీతి అనే కుమార్తె ఉంది. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అలోక్ అనే యువకుడు ప్రీతిని రోజూ ఫాలో అయ్యేవాడు. ఎలాగైనా ప్రీతిని ప్రేమించాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు నడుచుకుంటూ వెళ్తున్న యువతిని మధ్యలో ఆపి.. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’.. అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే ఇందుకు ప్రీతి నిరాకరించింది. ‘‘నాకు ఇలాంటివి నచ్చవు... ఇంకోసారి నా వెంట పడొద్దు’’.. అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయింది. దీంతో ఆమెపై అలోక్ పగ పెంచుకున్నాడు. తనకు దక్కంది ఎవరికీ దక్కకూడదని కుట్రపన్నాడు.

మా వదిన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ పక్కింటోళ్లకు కాల్ చేసి చెప్పాడా వ్యక్తి.. వాళ్లు వెళ్లి చూస్తే..


ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ప్రీతి, కుటుంబ సభ్యులు.. రాయ్‌గంజ్‌లో ఓ వివాహ వేడుకకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న అలోక్ వారిని మార్గ మధ్యలో అడ్డుకున్నాడు. పదునైన యుధంతో ఒక్కసారిగా వారిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ప్రీతి, ఆమె తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న అలోక్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

రోడ్డుపై నిలబడి లిఫ్ట్ అడిగిందో 32 ఏళ్ల మహిళ.. అటుగా వెళ్తూ కారులో ఎక్కించుకున్న డ్రైవర్.. చివరకు..

Updated Date - 2022-04-27T13:25:43+05:30 IST