ప్రియుడి కోసం భర్తను దూరం పెట్టింది... నాకు చేసినట్లు మరెవరికీ చేయొద్దంటూ భార్యకు లేఖ రాసిన భర్త..

ABN , First Publish Date - 2022-04-23T18:40:29+05:30 IST

వివాహేతర సంబంధాలు తప్పని తెలిసినా చాలా మంది తప్పటడుగులు వేస్తుంటారు. తెలిసి తెలిసి తప్పు మీద తప్పులు చేస్తుంటారు. ప్రాణంగా చూసుకునే భర్తను భార్య...

ప్రియుడి కోసం భర్తను దూరం పెట్టింది... నాకు చేసినట్లు మరెవరికీ చేయొద్దంటూ భార్యకు లేఖ రాసిన భర్త..
ప్రతీకాత్మక చిత్రం

వివాహేతర సంబంధాలు తప్పని తెలిసినా చాలా మంది తప్పటడుగులు వేస్తుంటారు. తెలిసి తెలిసి తప్పు మీద తప్పులు చేస్తుంటారు. ప్రాణంగా చూసుకునే భర్తను భార్య... నమ్మకం పెంచుకున్న భార్యను భర్త.. మోసం చేసుకుంటుంటారు. వీరు చేసే తప్పుల కారణంగా చివరకు పిల్లలు అనాథలవుతుంటారు. మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఘటన సంచలనం కలిగించింది. ప్రియుడి మాయలో పడి ప్రేమగా చూసుకుంటున్న భర్తను దూరం పెట్టింది. మనసు మార్చుకుంటుందిలే అనుకుని భర్త ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో.. ‘‘ నాకు చేసినట్లు మరెవరికీ చేయొద్దు’’ అంటూ భార్యకు లేఖ రాసి, అతడు చేసిన పని.. స్థానికులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కొత్వాలి ప్రాంతంలోని ఖుదా బస్తీకి చెందిన ఆకాశ్ షాక్యా (30)కి రెండేళ్ల క్రితం గ్వాలియర్‌కి చెందిన జాను అనే యువతితో వివాహమైంది. అయితే వివాహమైన కొన్ని నెలలకు ఆకాశ్‌కి షాకింగ్ నిజాలు తెలిశాయి. పెళ్లికి ముందు తన భార్య సంజయ్ అనే వ్యక్తిని ప్రేమించిందనే విషయం తెలిసింది. కొన్నాళ్లు పోతో మనసు మార్చుకుంటుందిలే అనుకుని తనకు తాను సర్దిచెప్పుకొన్నాడు. అయితే ఆమె మాత్రం తన ప్రియుడినే తలుచుకుంటూ భర్తను దూరం పెట్టేది. అయినా ఆకాశ్ మాత్రం భార్యను ఏమీ అనేవాడు కాదు. అయితే ఇటీవల ఓ రోజు ఆమె ఉన్నట్టుండి పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకుని భార్యను తీసుకొచ్చేందుకు వెళ్లినా ఆమె మాత్రం వచ్చేందుకు అంగీకరించలేదు. ఇలా తరచూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా.. ఆమె మాత్రం వచ్చేందుకు ఒప్పుకోలేదు. చివరకు విసిగిపోయిన అతను భార్యకు లేఖ రాశాడు.

స్నేహితుడితో కలిసి అత్త ఇంటికి వెళ్లిన యువకుడు.. దుస్తులు మార్చుకుని బయటికి వచ్చాడు.. స్థానికులకు అనుమానం వచ్చి వెళ్లి చూడగా..


'జానూ, ఇది నీ కోసమే. నిన్ను పికప్ చేసుకునేందుకే నేను గ్వాలియర్ వచ్చాను. నువ్వు సంజయ్‌తో మాట్లాడతావని నాకు చాలా రోజుల క్రితమే తెలుసు. నా ప్రేమ నిన్ను మారుస్తుందేమోనని భావించాను. కానీ నువ్వు మారలేదు. మీ అమ్మ, చెల్లి మాటలు విని నాతో రావడానికి నిరాకరించావు. నీ కోసం నేను ఎన్ని కన్నీళ్లు కార్చానో నీకు తెలియదు. ఒక్కసారి కూడా నా కళ్లలోకి చూడలేదు. నీ గురించి ఎవరేమి చెప్పినా పట్టించుకోలేదు. కానీ నువ్వు నా ప్రేమను కూడా మర్చిపోయావు. నువ్వు నాకు చేనట్లు మరెవరికీ చేయొద్దు. నిన్ను తప్ప నా జీవితంలో ఎవరినీ ఊహించుకోలేను. నేను నిన్ను మాత్రమే ప్రేమించాను. నిన్ను మరెవరితోనూ చూడలేను.. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నన్ను ఎప్పటికీ మిస్ కావొద్దు. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలి. అమ్మ నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. ఆకాష్ శక్య.. ది ఎండ్.' అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి అంటే ఆ తొమ్మిది మంది కూతుళ్లకు ఎంతో అభిమానం.. అయితే అతను వారి పక్కన కూర్చుని చేసిన పనికి..

Updated Date - 2022-04-23T18:40:29+05:30 IST