వేర్వేరుగా ఉంటున్న తల్లిదండ్రులను కలపాలని కుమారుడి తపన.. అన్ని ప్రయత్నాలూ విఫలమవడంతో చివరకు అతడు చేసిన పని..

ABN , First Publish Date - 2022-05-18T14:51:49+05:30 IST

పిల్లలకు ఎన్ని సౌకర్యాలు ఉన్నా.. తల్లిదండ్రుల ప్రేమ లేకపోతే, ఆ బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. కొన్ని కుటుంబల్లో పిల్లలకు తల్లి ప్రేమ, మరికొన్ని కుటుంబాల్లో తండ్రి లేని లోటు..

వేర్వేరుగా ఉంటున్న తల్లిదండ్రులను కలపాలని కుమారుడి తపన.. అన్ని ప్రయత్నాలూ విఫలమవడంతో చివరకు అతడు చేసిన పని..
తరుణ్‌ (ఫైల్)

పిల్లలకు ఎన్ని సౌకర్యాలు ఉన్నా.. తల్లిదండ్రుల ప్రేమ లేకపోతే, ఆ బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. కొన్ని కుటుంబల్లో పిల్లలకు తల్లి ప్రేమ, మరికొన్ని కుటుంబాల్లో తండ్రి లేని లోటు వేధిస్తూ ఉంటుంది. అయితే తల్లిదండ్రులు ఉండి కూడా వారి ప్రేమను పొందలేని వారి పరిస్థితి ఇంకెంత బాధాకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడులో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. వేర్వేరుగా ఉంటున్న తల్లిదండ్రులను కలిపేందుకు వారి పిల్లలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు వారి కుమారుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..


చెన్నై నామక్కల్‌ జిల్లా కొళ్లకురిచ్చి గ్రామం పరిధిలోని సింగలాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రవి, మేఘల దంపతులకు తరుణ్‌(17), ఓ కుమార్తె ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కుటుంబంలో అనుకోని సమస్యలు వచ్చి పడ్డాయి. కొన్నేళ్ల క్రితం దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. రోజురోజుకూ గొడవలు ఎక్కువవడంతో ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారు. తండ్రి వద్ద కుమారుడు, తల్లి వద్ద కుమార్తె ఉంటున్నారు. తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండడం వారి పిల్లలకు నచ్చలేదు. ఇద్దరినీ కలిపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా రవి, మేఘల మాత్రం దూరంగానే ఉంటున్నారు. దీంతో వారి పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యేవారు.

‘‘నా భార్యకు చీర కట్టుకోవడం రాదు.. కనీసం సరిగా నడవడం కూడా చేతకాదు’’.. అంటూ చివరకు ఆ వ్యక్తి చేసిన పని..


తరుణ్ ఇటీవల ఇంటర్ పరీక్షలు రాస్తున్నాడు. అయితే మానసిక ఒత్తిడి కారణంగా చదువుపై శ్రద్ధ పెట్టలేకున్నాడు. మంగళవారం గది తలుపులు వేసుకుని బయటకు రాలేదు. తండ్రి ఎంత పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా.. కుమారుడు ఉరికి వేలాడుతూ కనిపించాడు. పక్కనే సూసైడ్ నోట్ కనిపించింది. అందులో ’’తల్లిదండ్రులు దూరంగా ఉండడం తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది. అమ్మానాన్న కలిసి జీవించాలన్నదే నా కోరిక. నా చావుతోనైనా అది నెరవేరుతుందని కోరుకుంటున్నా’’.. అని రాసి ఉంది. తరుణ్ మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చలనం లేకుండా పడి ఉన్న తల్లి పక్కన 6నెలల చిన్నారి ఒకటే ఏడుపు.. స్థానికులు కంగారుగా వెళ్లి చూడగా..

Updated Date - 2022-05-18T14:51:49+05:30 IST