మేడ మీద గాఢనిద్రలో వదిన.. అర్ధరాత్రి గదిలో అన్నను చంపిన తమ్ముడు.. విచారణలో విస్తుపోయే నిజాలు..!
ABN , First Publish Date - 2022-04-26T16:56:52+05:30 IST
తల్లి, తండ్రి, గురువు, దైవం.. అని భావించే రోజులు కనుమరుగవుతున్నాయి. కొందరు శాడిస్టులు వావివరుసలు లేకుండా ప్రవర్తించే తీరు.. సభ్య సమాజం తలదించుకునేలా..
తల్లి, తండ్రి, గురువు, దైవం.. అని భావించే రోజులు కనుమరుగవుతున్నాయి. కొందరు శాడిస్టులు వావివరుసలు లేకుండా ప్రవర్తించే తీరు.. సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. వదిన అంటే తల్లి తర్వాత తల్లి అని అంటారు. అయితే ఓ ప్రబుద్ధుడు మాత్రం తన వదినను అలా చూడలేదు. ఆమెపై మనుసులో ప్రేమ పెంచుకున్నాడు. రోజూ అన్న లేని సమయలో ఇంట్లోకి వెళ్లేవాడు. ఓ రోజు వదిన మేడపై గాఢనిద్రలో ఉండగా.. అర్ధారత్రి ఇంట్లోకి ప్రవేశించాడు. పడుకుని ఉన్న అన్నను దారుణంగా హత్య చేశాడు. చివరకు పోలీసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
ఉత్తరప్రదేశ్ లక్నోలోని చిన్ హాట్ ప్రాంతంలో మోహిల్ అనే వ్యక్తి.. తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. అయితే వీరి సంసారంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. స్థానికంగా నివాసం ఉండే భూపేంద్ర సాహు అనే వ్యక్తి మోహిల్ ఇంటికి తరచూ వస్తుంటాడు. వరుసకు సోదరుడు కావడంతో మోహిల్ కుటుంబ సభ్యుడిలా ఉండేవాడు. అయితే భూపేంద్ర మాత్రం వదిన అని కూడా చూడకుండా మోహిల్ భార్యపై కన్నేశాడు. ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉండేవాడు. మోహిల్ లేని సమయం చూసుకుని రోజూ ఇంటికి వచ్చేవాడు. మోహిల్ భార్యకు ఏవేవో మాటలు చెబుతూ దగ్గర కావాలని ప్రయత్నించేవాడు. ఓ రోజు ఉన్నట్టుండి ఆమెను పక్కకు లాగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించింది. అయినా భూపేంద్ర ప్రవర్తనలో మార్పు రాలేదు.
వాళ్లకు అసలు బుద్ధుందా..? అంటూ ఈ 8 ఏళ్ల పిల్లాడి తల్లిదండ్రులపై నెటిజన్ల ఫైర్.. ఈ వీడియోను చూస్తే..
తరచూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో ఓ రోజు మోహిల్‌కు విషయం మొత్తం తెలియజేసింది. ఆగ్రహానికి గురైన మోహిల్.. భూపేంద్రను పిలిచి గట్టిగా మందలించాడు. దీంతో అప్పటినుంచి మోహిల్‌పై పగ పెంచుకున్నాడు. అన్నను అంతమొందిస్తే.. వదిన తన సొంతమవుతుందని కుట్ర పన్నాడు. ఓ రోజు మోహిల్ ఇంట్లో కింద గదిలో పడుకుని ఉండగా.. అతడి భార్య మేడపై నిద్రపోతోంది. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన భూపేంద్ర అన్నపై దాడి చేసి, కత్తితో మోహిల్ గొంతు కోసి పరారయ్యాడు. మేడపై ఉన్న మోహిల్ భార్య .. అరుపులు విని కంగారుగా కిందికి వచ్చింది. రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న భర్తను చూసి బోరున విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.