కంగారుగా ఇంటికొచ్చిన కూతురు.. ఏడుస్తూ.. అమ్మా!.. ఊరి బయట పొలంలో... అంటూ ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-06-20T00:15:08+05:30 IST

మహిళలపై రోజురోజుకూ అఘాయిత్మాలు పెరిగిపోతున్నాయి. బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ అత్యాచారాలు, హత్యలకు గురవుతున్నారు..

కంగారుగా ఇంటికొచ్చిన కూతురు.. ఏడుస్తూ.. అమ్మా!.. ఊరి బయట పొలంలో... అంటూ ఆమె చెప్పింది విని..

మహిళలపై రోజురోజుకూ అఘాయిత్మాలు పెరిగిపోతున్నాయి. బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ అత్యాచారాలు, హత్యలకు గురవుతున్నారు. మాయమాటలు నమ్మి మోసపోయేవారు కొందరైతే.. ఎదురుతిరిగే క్రమంలో రేపిస్టుల చేతిలో మరికొందరు బలవుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ తరహా ఘటనే జరిగింది. ఓ బాలిక కంగారుగా ఇంటికి వచ్చింది. ఏడుస్తూ ఉన్న ఆమెను చూసి తల్లిదండ్రులు.. ఏమైందమ్మా? అని అడిగారు. ఊరి బయట పొలంలో జరిగిన ఘటన గురించి ఆమె చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. అసలు ఏం జరిగిందంటే..


ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లా ఫర్సాబహార్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 17ఏళ్ల బాలిక శుక్రవారం సాయంత్రం.. బంధువుల ఇంటికి వెళ్తున్నా అని చెప్పి ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరింది. మార్గమధ్యలో మనీష్ యాదవ్ అనే యువకుడు అడ్డుపడ్డాడు. నువ్వంటే ఇష్టం.. అని లవ్ ప్రపోజల్ చేశాడు. అందుకు బాలిక ఒప్పుకోకపోవడంతో చేయి పట్టుకుని బలవంతంగా గ్రామ పరిసరాల్లోని పొలాల్లోకి లాక్కెళ్లాడు. అక్కడ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.

బస్సు డ్రైవర్‌ను ప్రేమించిన యువతి.. కొన్నాళ్లకు తన జీవితంలోకి ఎంటరైన మరో వ్యక్తి.. చివరికి రెండో ప్రేమికుడితో కలిసి..


బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో యువకుడు ఆమెను తీవ్రంగా కొట్టాడు. అయినా బాలిక ఒప్పుకోకుండా ఎలాగోలా అతని నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లింది. ఏడుస్తూ వెళ్లిన ఆమెను చూసి తల్లిదండ్రులు భయపడ్డారు. ఏమైందమ్మా అని అడగ్గా.. బాలిక జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

వాయిస్ బాగుందని యువతిని తన భజన బృందంలో చేర్చుకున్నాడు.. ఓ రోజు ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లవ్ ప్రపోజ్ చేశాడు.. ఆరు నెలల తర్వాత చూస్తే..

Updated Date - 2022-06-20T00:15:08+05:30 IST