యువతులు తోటలో ఉండగా వీడియో తీసిన యువకుడు.. చెల్లెళ్ల వీడియోను డిలీట్ చేయమన్న అన్న.. చివరకు..
ABN , First Publish Date - 2022-06-27T02:39:40+05:30 IST
కొన్నిసార్లు చిన్న సమస్యలు కూడా చిలికి చిలికి గాలివానలా మారుతుంటాయి. చివరకు హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటాయి. ఎక్కువగా మహిళల విషయంలో ఇలాంటి గొడవలు రోజూ ఎక్కడో చోట జరగడం చూస్తూనే ఉన్నాం...
కొన్నిసార్లు చిన్న సమస్యలు కూడా చిలికి చిలికి గాలివానలా మారుతుంటాయి. చివరకు హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటాయి. ఎక్కువగా మహిళల విషయంలో ఇలాంటి గొడవలు రోజూ ఎక్కడో చోట జరగడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు యువతులు తోటలో ఉండగా.. ఓ యువకుడు వీడియో తీశాడు. అయితే తన చెల్లెళ్ల వీడియోను డిలీట్ చేయాలంటూ అన్న.. అతడితో గొడవకు దిగాడు. ఈ విషయంలో చివరకు చోటు చేసుకున్న ఘటనతో.. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ పరిధి బన్స్‌గావ్ సమీపంలోని బరౌలీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఇంద్రసన్ చౌహాన్‌కు సంధ్య, గాయత్రి, రఘునాథ్ చౌహాన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంధ్య, గాయత్రి కలిసి శుక్రవారం గ్రామ సమీపంలోని తోటలో నేరేడు చెట్టు ఎక్కి పళ్లు కోస్తూ ఉన్నారు. అదే సమయంలో వారిని గమనించిన రవిశంకర్ యాదవ్.. పోన్‌లో వీడియో తీశాడు. ఈ విషయం తెలుసుకున్న రఘునాథ్ చౌహాన్.. రవిశంకర్ వద్దకు వెళ్లి.. తన చెల్లెళ్లను వీడియో ఎందుకు తీశావంటూ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గమనించిన స్థానికులు ఇద్దరికీ సర్దిచెప్పి ఇంటికి పంపించారు. అయితే శనివారం మళ్లీ ఇదే విషయమై వారి మధ్య గొడవ జరిగింది.
ప్రేయసిని కొండపై నుంచి తోసేసిన ప్రియుడు.. కింద పడుతూ గాలిలోనే ప్రియుడికి బ్రేకప్ చెప్పిన యువతి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..
ఈ క్రమంలో రవిశంకర్ కోపంతో.. సంధ్య, గాయత్రిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన రఘునాథ్ చౌహాన్.. చెల్లెళ్లను కాపాడేందుకు అక్కడికి వెళ్లాడు. దీంతో రవిశంకర్ యాదవ్, అతని సోదరుడు హరిశంకర్ యాదవ్.. మరికొందరు కలిసి రఘునాథ్ చౌహాన్‌ను చుట్టుముట్టారు. అనంతరం రఘునాథ్‌పై రవిశంకర్.. కత్తితో దాడి చేశాడు. కడుపులో బలంగా పొడవంతో రఘునాథ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిశంకర్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. రఘునాథ్ మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.