అవకరంతో జన్మించినా... క్షణకాలం కూడా ఆగకుండా సూర్య రథాన్ని నడిపేది ఎవరంటే...

ABN , First Publish Date - 2022-12-05T10:14:16+05:30 IST

పురాణాల ప్రకారం అటు పంచదేవతలలో ఇటు గ్రహాలలో పరిగణించి దగిన ఏకైక దైవం సూర్యదేవుడు. సూర్యుడిని గ్రహాల రాజు అని కూడా అంటారు. సూర్యభగవానుడి ప్రభావం తోనే ఈ జగత్తు నడుస్తుంది.

అవకరంతో జన్మించినా... క్షణకాలం కూడా ఆగకుండా సూర్య రథాన్ని నడిపేది ఎవరంటే...

పురాణాల ప్రకారం అటు పంచదేవతలలో ఇటు గ్రహాలలో పరిగణించి దగిన ఏకైక దైవం సూర్యదేవుడు. సూర్యుడిని గ్రహాల రాజు అని కూడా అంటారు. సూర్యభగవానుడి ప్రభావం తోనే ఈ జగత్తు నడుస్తుంది. సూర్యుడు గుర్రపు రథంపై స్వారీ చేస్తూ నిరంతరం కదులుతుంటాడని చెబుతుంటారు. సూర్యుని రథం ఒక్క క్షణం కూడా ఆగదు. మరి ఈ రథాన్ని ఎవరు నడుపుతారనేది కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మహాభారతంలోని వివరాల ప్రకారం, సూర్య భగవానుడి రథాన్ని నడిపే సారథి పేరు అరుణుడు. అతను విష్ణువు వాహనం అయిన గరుడదేవుని సోదరుడు. అరుణుడు... మహర్షి కశ్యపుడు, వినీతల సంతానం. పురాణాల ప్రకారం వినీత తన భర్త మహర్షి కశ్యపునికి సేవ చేసిన తర్వాత ఇద్దరు శక్తివంతమైన కుమారులను ప్రసాదించమంటూ వరం కోరింది. దీంతో మహర్షి కశ్యపుడు ఆమెకు ఆ వరం ప్రసాదించాడు.

కొన్నాళ్లకు వినీత రెండు గుడ్లు పెట్టింది. అప్పుడు మహర్షి కశ్యపుడు వినీతతో "ఈ గుడ్ల నుంచి నీకు ఇద్దరు శక్తివంతులైన కుమారులు జన్మిస్తారు" అని చెప్పారు. ఇది జరిగిన కొంతకాలం తరువాత కూడా పిల్లలు ఆ గుడ్ల నుండి బయటకు రాకపోవడంతో, కుతూహలంతో వినీత ఒక గుడ్డును పగలగొట్టింది. దీంతో అరుణుడు ఆ గుడ్డు నుండి బయటకు వచ్చాడు. అయితే ముందుగానే ఆ గుడ్డు పగలడంతో అరుణునికి కాళ్ళు లేవు. దీంతో అరుణుడు కోపంతో తల్లిని దాసిగా మారుతావంటూ శపించాడు. అనంతర కాలంలో అరుణుడు కఠోర తపస్సు చేసి సూర్యదేవుని రథానికి సారథి అయ్యాడు.

మహాభారతం ప్రకారం శక్తివంతమైన గరుడుడు వినీత పెట్టిన రెండవ గుడ్డు నుండి జన్మించాడు. దీని ప్రకారం చూస్తే అరుణుడు, గరుడుడు ఒకే తల్లిదండ్రుల పిల్లలు. అంటే సోదరులు. అరుణుని శాపం కారణంగా, అతని తల్లి దాసిగా మారినప్పుడు గరుడుడు ఆమెను బానిసత్వం నుండి విడిపించాడు. అతని పరాక్రమాన్ని చూసిన విష్ణువు అతనిని తన వాహనంగా చేసుకున్నాడు.

Updated Date - 2022-12-05T10:14:18+05:30 IST