KL Rahul: అభిమానుల డిమాండ్‌కు నో చెప్పేసిన టీమిండియా బ్యాటింగ్ కోచ్

ABN , First Publish Date - 2022-10-29T15:46:36+05:30 IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మాంచి దూకుడుమీదుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఉత్కంఠ విజయం

KL Rahul: అభిమానుల డిమాండ్‌కు నో చెప్పేసిన టీమిండియా బ్యాటింగ్ కోచ్

పెర్త్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మాంచి దూకుడుమీదుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఉత్కంఠ విజయం సాధించిన రోహిత్ శర్మ సేన, రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కేఎల్ రాహుల్ (KL Rahul) ఈ రెండు మ్యాచుల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. పాకిస్థాన్‌పై నాలుగు పరుగులు మాత్రమే చేసిన ఈ ఓపెనర్.. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. రెండు మ్యాచుల్లోనూ కలిపి 13 పరుగులు మాత్రమే చేశాడు. ఇది టీమిండియా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అతడిని పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్‌ను పక్కనపెట్టి అతడి స్థానంలో రిషభ్ పంత్‌ (Rishabh Pant)ను తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ (Vikram Rathour) కీలక వ్యాఖ్యలు చేశాడు. సూపర్-12లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో మ్యాచ్‌లోనూ రాహులే బ్యాటింగ్ ప్రారంభిస్తాడని తేల్చి చెప్పాడు. తొలి రెండు మ్యాచుల్లోనూ రాహుల్ విఫలం కావడంపై రాథోడ్ మాట్లాడుతూ.. రెండు మ్యాచుల్లో ఆడలేనంత మాత్రాన అతడిని అంచనా వేయలేమని అన్నాడు. నిజానికి అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని ప్రశంసించాడు. ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడన్నాడు. కాబట్టి రాహుల్ స్థానాన్ని మార్చే ఆలోచన ఇప్పటికిప్పుడు లేదని రాథోడ్ స్పష్టం చేశాడు.

Updated Date - 2022-10-29T15:46:37+05:30 IST