3rd ODI: ముగిసిన 25 ఓవర్ల ఆట.. మరోసారి నిరాశపరిచిన సూర్య.. భారత్ స్కోర్ ఎంతంటే..
ABN , First Publish Date - 2022-11-30T09:27:57+05:30 IST
భారత్, న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్‌చర్చ్ (Christchurch) వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 25 ఓవర్లు ముగిసేసరికి కీలకమైన 5వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేసింది.
క్రైస్ట్‌చర్చ్: భారత్, న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్‌చర్చ్ (Christchurch) వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 25 ఓవర్లు ముగిసేసరికి కీలకమైన 5వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు మరోసారి ఫెయిల్ అయ్యారు. శుబ్‌మన్ గిల్ కేవలం 13 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో భారత్ 39 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 28 పరుగులు చేసి క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన సారథి శిఖర్ దావన్ రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 55 పరుగుల వద్ద ఓపెనర్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కూడా త్వరగానే వికెట్ పారేసుకున్నాడు.
ఫామ్ లేక తంటాలు పడుతున్న రిషబ్ కేవలం 10 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత టీ20ల్లో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ సైతం ఈ మ్యాచ్‌లో మరోసారి నిరాశపరిచాడు. 6పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సౌథీ బౌలింగ్‌లో మిల్నేకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో భారత్ 110 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో అర్ధశతానికి దగ్గరైన శ్రేయస్ కూడా ఫెర్గూసన్‌కు దొరికిపోయాడు. 49 పరుగులు చేసి కేవలం ఒక్క పరుగుతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇలా ధావన్ సేన 121 పరుగులకే కీలకమైన 5వికెట్లు పారేసుకుంది. ప్రస్తుతం 27 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 5 వికెట్లకు 126గా ఉంది. క్రీజులో దీపక్ హుడా(02), వాషింగ్టన్ సుందర్ (04) ఉన్నారు.