Sehar Shinwari: భారత్‌ను ఓడిస్తే జింబాబ్వే కుర్రాడిని పెళ్లాడతా: పాక్ నటి బంపర్ ఆఫర్
ABN , First Publish Date - 2022-11-03T19:27:22+05:30 IST
టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలు మారుతున్నాయి. భారత్, జింబాబ్వే చేతుల్లో ఓడిన పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది
ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలు మారుతున్నాయి. భారత్, జింబాబ్వే చేతుల్లో ఓడిన పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. తాజాగా దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆ జట్టులో మళ్లీ సెమీస్ ఆశలు చిగురించారు. మరోవైపు, భారత జట్టు ఆదివారం జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా (Team India) విజయం సాధిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నటి సెహర్ షిన్వరి (Sehar Shinwari) కీలక ప్రకటన చేసింది. ఆదివారం నాటి మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు భారత్‌ను ఓడిస్తే తాను జింబాబ్వే కుర్రాడిని పెళ్లాడతానని పేర్కొంది.
జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ (pakistan) ఒక్క పరుగు తేడాతో ఓడి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకున్న నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేసింది. పాకిస్థాన్‌కు పిచ్చి ఫ్యాన్ అయిన షిన్వరి బంగ్లాదేశ్-భారత్ మ్యాచ్ నాటి నుంచే వరుస ట్వీట్లు చేస్తోంది. ఆ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే తన పేరును ‘నరేంద్రమోదీ’ అని మార్చుకుంటానని శపథం చేసింది. ఇప్పుడేమో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో జింబాబ్వే గెలిస్తే జింబాబ్వే కుర్రాడిని పెళ్లాడతానని ఆఫర్ ఇచ్చింది.
షిన్వరి చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మరీ ఇంత చవకబారు మాటలు పనికిరావని ఒకరంటే.. సరే కానీ, అది జరిగేది ఎప్పుడని మరొకరు ప్రశ్నిస్తున్నారు. నాది జింబాబ్వేనే అని ఇంకో నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇండియా అంటే నీకెందుకంత అయిష్టం? అని మరో నెటిజన్ నిలదీశాడు. అది సరేలే కానీ పేరెప్పుడు మార్చుకుంటావ్? అంటూ ఆమె ఒకటో తేదీ నాటి ట్వీట్‌ను స్క్రీన్‌షాట్ తీసి ప్రశ్నిస్తున్నారు.