India vs England: సెమీ-ఫైనల్ ముందు కీలక పరిణామం.. రోహిత్ శర్మకు గాయం
ABN , First Publish Date - 2022-11-08T18:15:03+05:30 IST
టీ20 వరల్డ్ కప్‌లో (T20 world cup2022) కీలక భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (India vs England) సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకి కీలక పరిణామం ఎదురైంది.
అడిలైడ్: టీ20 వరల్డ్ కప్‌లో (T20 world cup2022) కీలక భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (India vs England) సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకి కీలక పరిణామం ఎదురైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కుడి చేతికి గాయమైంది. అడిలైడ్ ఓవల్‌లో ఇంగ్లండ్‌పై (England) సెమీస్ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం ప్రాక్టిస్ చేస్తుండగా రోహిత్ గాయపడ్డాడని రిపోర్టులు చెబుతున్నాయి. ముంజేయిపై (Forearm) గాయమైందని, ఆ సమయంలో తీవ్ర నొప్పితో బాధపడ్డాడని పేర్కొన్నాయి. దెబ్బతగిలిన తర్వాత రోహిత్ బ్యాటింగ్ చేయలేదని, అయితే కాసేపు ఇబ్బందిపడ్డాక తేరుకున్నాడని, సానుకూలంగానే సెషన్‌ను ముగించాడని వెల్లడించాయి. అయితే రోహిత్ శర్మ గాయం తీవ్రత ఎంత? గురువారం ఇంగ్లండ్ మ్యాచ్‌లో అతడు ఆడడంపై ఏమైనా ప్రభావం ఉంటుందా? అనే విషయాలు తెలియరాలేదు. దీనిపై టీమిండియా మేనేజ్‌మెంట్ కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
కాగా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో పెద్దగా రాణించడం లేదు. ఇప్పటివరకు మొత్తం 89 పరుగులు మాత్రమే చేశాడు. నెదర్లాండ్స్‌పై మాత్రమే అత్యధికంగా 53 రన్స్ చేశాడు. కాగా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 5 మ్యాచ్‌లు ఆడి 246 పరుగులతో ఈ వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక మరో స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 225 పరుగులతో టాప్ స్కోరర్లలో ఒకడిగా ఉన్నాడు.