Sanju Samson: సంజు శాంసన్‌ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదంటే?.. అసలు విషయం చెప్పేసిన ధావన్

ABN , First Publish Date - 2022-11-27T19:48:24+05:30 IST

భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు (ఆదివారం) జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. 12.5 ఓవర్ల

Sanju Samson: సంజు శాంసన్‌ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదంటే?.. అసలు విషయం చెప్పేసిన ధావన్

హమిల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు (ఆదివారం) జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. 12.5 ఓవర్ల వద్ద మ్యాచ్ రద్దయ్యే సమయానికి భారత జట్టు వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. తొలుత 5 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభమైంది. దీంతో నిలిచిపోయిన ఆట దాదాపు మూడున్నర గంటల తర్వాత తిరిగి ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. అయితే, ఆ తర్వాత 12.5 ఓవర్ల వద్ద వరుణుడు మరోమారు ప్రత్యక్షం కావడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. సంజు శాంసన్ (Sanju Samson), శార్దూల్ ఠాకూర్ స్థానాల్లో దీపక్ హుడా, దీపక్ చాహర్ తుది జట్టులోకి వచ్చారు. టీ20ల్లో సంజు శాంసన్‌ (Sanju Samson)కు చోటు దక్కకపోవడంపై విమర్శలు వెల్లువెత్తడంతో వన్డేల్లో అవకాశం కల్పించారు. తొలి వన్డేలో పర్వాలదేనిపించిన సంజును రెండో వన్డేలో పక్కన పెట్టడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. మ్యాచ్ ఆగిపోయిన తర్వాత.. భారత జట్టులో జరిగిన రెండు మార్పులపై అడిగిన ప్రశ్నకు శిఖర్ ధావన్ బదులిస్తూ.. తొలి వన్డేలో బౌలింగ్ తేలిపోవడంతో ఆరో బౌలర్‌ను కావాలనుకున్నామని, అందుకనే సంజు శాంసన్‌ (Sanju Samson)ను పక్కనపెట్టి హుడాను తీసుకున్నట్టు చెప్పాడు. చాహర్ రెండు వైపుల నుంచి బంతిని స్వింగ్ చేయగలడని అందుకనే తుది జట్టులో అతడికి చోటిచ్చినట్టు వివరించాడు.

Updated Date - 2022-11-27T19:48:25+05:30 IST