ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్‌కు అరుదైన గౌరవం
ABN , First Publish Date - 2022-08-16T07:38:22+05:30 IST
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్‌కు అరుదైన గౌ రవం దక్కింది.
ఖానాపూర్, ఆగస్టు 15 : ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్‌కు అరుదైన గౌ రవం దక్కింది. ఇటీవల ఖానాపూర్‌లో వచ్చిన వరదలలో చిక్కుకున్న వారికి అందించిన సహాయ సహకారాలకు గాను అంకం రాజేందర్‌ను ఉత్తమ మున్సిపల్ చైర్మన్‌గా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన స్వాతం త్య్ర దినోత్స వేడుకల్లో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కొరిపెల్లి విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీలు అంకం రాజేందర్‌కు ఉత్తమ మున్సిపల్ చైర్మన్‌గా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ... తనకు ఉత్తమ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసాపత్రం దక్కడం తనలో మరింత బాధ్యతను పెంచిందని రెట్టింపు ఉత్సాహంతో పట్టణ ప్రజలకు సేవలు అందిస్తానన్నారు.