Mancherial District: ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం

ABN , First Publish Date - 2022-12-17T06:55:54+05:30 IST

జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి ఆరుగురు

Mancherial District: ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం

Manchryala: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులతో పాటు ఆరుగురు మంటల్లో కాలిబూడిదయ్యారు. ఈ ఘటన మందమర్రి మండలంలోని వెంకటాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో చుటుప్రక్కల ఉన్న స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు శివయ్య(50), పద్మ(45), మౌనిక(23), శాంతయ్య, చిన్నారులు హిమ బిందు, స్వీటీ పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2022-12-17T08:52:10+05:30 IST