కెరమెరికి చేరిన ఆదివాసీల పాదయాత్ర
ABN , First Publish Date - 2022-09-20T03:55:38+05:30 IST
ఈ నెల 15న గుండాలలో ప్రారంభ మైన ఆదివాసీల పాదయాత్ర సోమవారం కెరమెరి మండలకేంద్రానికి చేరుకుంది.
కెరమెరి, సెప్టెంబరు 19: ఈ నెల 15న గుండాలలో ప్రారంభ మైన ఆదివాసీల పాదయాత్ర సోమవారం కెరమెరి మండలకేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భం గా హట్టి రోడ్డులో ఉన్న కుమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసులు ఏళ్లుగా సాగుచేస్తున్న పోడుభూములకు పట్టాలివ్వా లని, లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల న్నారు. 317జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.