హరిహర క్షేత్రంలో అంగరంగ వైభవంగా చండీయాగం
ABN , First Publish Date - 2022-12-27T01:52:49+05:30 IST
స్థానిక హరిహర క్షేత్ర రజతోత్సవాల రెండో రోజు సోమవారం మల్లన్న గుట్టపై అంగరంగ వైభవంగా చండీయాగం భక్తజన సందోహం మధ్య నిర్వహించారు.
నిర్మల్ కల్చరల్, డిసెంబరు 26 : స్థానిక హరిహర క్షేత్ర రజతోత్సవాల రెండో రోజు సోమవారం మల్లన్న గుట్టపై అంగరంగ వైభవంగా చండీయాగం భక్తజన సందోహం మధ్య నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి, ఆలయ ధర్మకర్తలు వినోదమ్మ, మురళీధర్ రెడ్డి దంపతులు ఉదయం గణపతి హోమం, శత చండీయాగం తదితర పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదిలా బాద్‌కు చెందిన ప్రవీణ్‌శర్మ పూజారుల బృందం ఆధ్వర్యంలో హామం నిర్వ హించారు. ఆలయ గురుస్వామి మూర్తి పర్యవేక్షణలో భక్తులకు భిక్ష, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పూజారి సదాశివశర్మ, కోశాధికారి వేణు గోపాల రెడ్డి, జ్యోతి దంపతులు, గురుస్వాములు సురేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, హనుమంత్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.